ఎయిర్‌టెల్ వినియోగ‌దారుల‌కు శుభవార్త‌.

Header Banner

ఎయిర్‌టెల్ వినియోగ‌దారుల‌కు శుభవార్త‌.

  Mon Sep 25, 2017 21:03        India, Telugu

ఇండియాలోనే అతిపెద్ద నెట్‌వర్క్‌ ఎయిర్‌టెల్‌ నూతన వినియోగదారులను ఆకర్షించడానికి ‘బోనస్‌ 30జీబీ’ పేరిట సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్‌ కింద నెలకు 10జీబీ చొప్పున మూడు నెలల పాటు ఉచిత డేటాను అందిస్తారు. అయితే, ఇది కేవలం కొత్తగా ఎయిర్‌టెల్‌లోకి చేరిన పోస్ట్‌పెయిడ్‌ వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుందని కంపెనీ పేర్కొంది. అంతే కాకుండా ఈ ఆఫర్‌ వర్తించాలంటే ఇప్పటి వరకు అమల్లో ఉన్న రూ.499, రూ.649, రూ.799, రూ.1,199 ప్లాన్లలో ఏదైనా ఒక దానిని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.

             గత నెలలో మొబైల్స్‌లో ఎయిర్‌టెల్‌ టీవీ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకున్న వినియోగదారులకు నెలకు 10జీబీ చొప్పున ఆరు నెలలపాటు ఉచిత డేటాను ఇస్తున్నట్లు ఎయిర్‌టెల్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.అయితే, ‘బోనస్‌ 30జీబీ’ పొందుతున్న వినియోగదారులు ఎయిర్‌టెల్‌ టీవీ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకున్నప్పటికీ కేవలం మూడు నెలలపాటు మాత్రమే ఉచిత డేటా పొందుతారు.



   Airtel-Goodnews