సమంతకు డబ్బింగ్‌.. కన్నీరు పెట్టుకున్నా

Header Banner

సమంతకు డబ్బింగ్‌.. కన్నీరు పెట్టుకున్నా

  Mon Sep 25, 2017 20:58        Cinemas, Telugu

కథానాయిక సమంత పాత్రలకు ఎక్కువగా డబ్బింగ్‌ చెబుతుంటారు గాయని చిన్మయి శ్రీపాద. ‘ఏమాయ చేసావె’, ‘దూకుడు’, ‘ఈగ’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘అత్తారింటికి దారేది’, ‘మనం’, ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ తదితర చిత్రాల్లో సమంత పాత్రలకు ఆమే డబ్బింగ్‌ చెప్పారు. సమంత ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘రాజుగారి గది 2’. ఇందులో కూడా ఆమె పాత్రకు చిన్మయినే డబ్బింగ్‌ చెప్పారట. ఈ విషయాన్ని చిన్మయి ట్విటర్‌లో పేర్కొన్నారు.

         ‘‘రాజుగారి గది 2’లో సమంత పాత్రకు డబ్బింగ్‌ చెప్పా. చివరిలో కన్నీరు పెట్టుకున్నా. ఆమె అద్భుతంగా నటించారు’ అని చిన్మయి అన్నారు. దీనికి ప్రతిస్పందనగా థ్యాంక్స్‌ చెప్పారు.

    సమంతతో పాటు నాగార్జున, సీరత్‌కపూర్‌ ‘రాజుగారి గది 2’లో ప్రధాన పాత్రలు పోషించారు. ఓంకార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్రం ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది. ఇందులో సమంత ఆత్మగా కనిపించారు. అక్టోబరు 13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


   Chinmayi-Samantha