పాండ్యా ప్రత్యేక ఆటగాడు: సంగక్కర

Header Banner

పాండ్యా ప్రత్యేక ఆటగాడు: సంగక్కర

  Mon Sep 25, 2017 20:47        Sports, Telugu

టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా ప్రత్యేకమైన ఆటగాడని ‍శ్రీలంక మాజీ కెప్టెన్‌ సంగక్కర ప్రశంసించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన ఇండోర్‌ వన్డేలో పాండ్యా (78) అద్భుత ఇన్నింగ్స్‌ భారత్‌ విజయం సులువైన విషయం తెలిసిందే. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో మ్యాన్‌ఆప్‌ ది మ్యాచ్‌ అందుకున్న పాండ్యాను కొనియాడుతూ సంగక్కర ట్వీట్‌ చేశారు.  

      ‘భారత్‌ సిరీస్‌ గెలిచింది. హార్దిక్‌ పాండ్యా ప్రత్యేకమైన ఆటగాడు. అన్ని పరిస్థితుల్లో ఆడేలా భారత్‌ పరిపూర్ణంగా ఉంది.’ అని సంగక్కర ట్వీట్‌ చేశారు. దీనికి హార్దిక్‌ పాండ్యా ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్‌ చేశారు.



   Sangankara-pandya