పెద్ద నోట్ల రద్దు ఓ నిరర్ధక 'సాహసం'

Header Banner

పెద్ద నోట్ల రద్దు ఓ నిరర్ధక 'సాహసం'

  Sat Sep 23, 2017 23:30        India, Telugu

పెద్ద నోట్లను రద్దుచేస్తూ ప్రధాని మోదీ గత ఏడాది నవంబర్ 8న తీసుకున్న నిర్ణయాన్ని మరోసారి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నిశితంగా విమర్శించారు. పెద్ద నోట్ల రద్దు 'సాహసం' వల్ల ఆర్థిక వ్యవస్థ 'తిరోగమన దిశ'లో పడిందన్నారు. సాంకేతికంగా చూసినా, ఆర్థికపరంగా చూసినా ఇది నిరుపయోగమైన 'సాహసం' అని మన్మోహన్ అన్నారు. నోట్ల రద్దు ప్రక్రియ కొన్ని లాటిన్ అమెరికా దేశాల్లో మినహా ఏ నాగరిక ప్రపంచంలోనూ విజయవంతం కాలేదని మన్మోహన్ అన్నారు. శనివారం మొహాలీలో జరిగిన ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లీడర్‌షిప్ సమ్మిట్‌లో 'నోట్ల రద్దు నిర్ణయం సరైనదేనా?' అని అడిగినప్పుడు మన్మోహన్ స్పందించారు. 'నోట్ల రద్దు అవసరమని నేను అనుకోవడం లేదు' అని సమాధానమిచ్చారు. సర్క్యులేషన్‌లో ఉన్న దాదాపు 86 శాతం నగదు ఉపసంహరించుకోవడం వల్ల, ఆర్థిక వ్యవస్థ నెమ్మదించడం మనం చూశామని ఆయన అన్నారు. నోట్ల రద్దు, ఆ వెనుకే జీఎస్‌టీ వల్ల దీర్ఘకాలంలో మంచి ఫలితం ఉండొచ్చని, అయితే స్వల్పకాలిక అవరోధాలను, అడ్డంకులను అధిగమించాల్సి ఉంటుందని మన్మోహన్ సింగ్ తెలిపారు.   పెద్ద నోట్ల రద్దు ఓ నిరర్ధక 'సాహసం'