ప్రముఖ నిర్మాతకు ఐదు రోజుల కస్టడీ

Header Banner

ప్రముఖ నిర్మాతకు ఐదు రోజుల కస్టడీ

  Sat Sep 23, 2017 23:28        India, Telugu

అత్యాచారం కేసులో హయత్ నగర్ పోలీసుల ముందు లోంగిపోయిన ప్రముఖ నిర్మాత కరీం మొరానీని ఐదు రోజుల కస్టడీకి అప్పగించారు. తనపై అత్యాచారం చేశాడని ఓ యువతి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి ఆధారాలు సేకరించి మొరానీకి నోటీసులు పంపారు. తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ కోసం యత్నించిన మొరానీకి సుప్రీంకోర్టు షాకిచ్చింది. దీంతో హయత్ నగర్ పోలీసుల ముందు లొంగిపోయాడు. 7వ మెట్రోపాలిటన్ మేజిస్టేట్ కోర్టులో పోలీసులు మొరానీని హాజరుపరిచారు. న్యాయస్థానం 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు అతడిని చర్లపల్లి జైలుకు తరలించారు. ఆ తర్వాత మెజిస్ట్రేట్ మొరానీని 5 రోజుల కస్టడీకి అప్పగించారు.   ప్రముఖ నిర్మాతకు ఐదు రోజుల కస్టడీ