షియోమీ అద్భుత ఆఫర్.. రూపాయికే స్మార్ట్ ఫోన్!

Header Banner

షియోమీ అద్భుత ఆఫర్.. రూపాయికే స్మార్ట్ ఫోన్!

  Sat Sep 23, 2017 22:54        India, Telugu

చైనా మొబైల్ మేకర్ షియోమీ అద్భుత ఆఫర్ ప్రకటించింది. ఈ నెల 27 నుంచి 29 వరకు నిర్వహించనున్న ప్రత్యేక సేల్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా రూపాయికే స్మార్ట్ ఫోన్‌ను అందిస్తోంది. ‘మొదట వచ్చిన వారికి మొదట’ ప్రాతిపదికన ఈ సేల్ నిర్వహించనున్నట్టు తెలిపింది. దీపావళిని పురస్కరించుకుని నిర్వహిస్తున్న ఈ సేల్‌లో షియోమీ ఇతర ఉత్పత్తులపై భారీ రాయితీలతోపాటు రూపాయికే ఫోన్లను అందించనున్నట్టు ప్రకటించింది.
 
 
27,28,29 తేదీల్లో రోజూ ఉదయం 11 గంటలకు, తిరిగి సాయంత్రం 5 గంటలకు రూపాయి సేల్ కొనసాగుతుంది. రెడ్‌మీ నోట్ 4, ఎంఐ రూటర్ 3సీ, రెడ్‌మీ 4, ఎంఐ బ్లూటూత్ మినీ స్పీకర్, ఎంఐ సెల్ఫీ స్టిక్, రెడ్‌మీ 4ఎ, ఎంఐ బ్యాండ్ హెచ్ఆర్ఎక్స్ ఎడిషన్, ఎంఐ క్యాప్యూల్స్ ఇయర్ ఫోన్స్, ఎంఐ వైఫై రిపీటర్, ఎంఐ బ్యాక్ ప్యాక్, ఐంఐ వీఆర్ ప్లేలను వినియోగదారులు రూపాయికే అందుకునే అవకాశం ఉంది. పూర్తి వివరాల కోసం షియోమీ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.


   shiyomi - one rupee