దసరాకు చెర్రీ సినిమాపై క్లారిటీ

Header Banner

దసరాకు చెర్రీ సినిమాపై క్లారిటీ

  Sat Sep 23, 2017 22:33        Cinemas, India, Telugu

ప్రస్తుతం రంగస్థలం అనే సినిమా చేస్తున్నాడు రామ్ చరణ్. ఈ మూవీ షూటింగ్ కొన్ని నెలలుగా ఏకథాటిగా సాగుతోంది. అయితే సినిమా విడుదలపై మాత్రం చాలామందికి చాలా అనుమానాలున్నాయి. కొందరేమో సంక్రాంతికి వస్తుందంటారు.. మరికొందరేమో సంక్రాంతికి రాదంటారు. ఈ అనుమానాలన్నీ దసరా రోజున నివృత్తి కాబోతున్నాయి.

ఈ దసరాకు రంగస్థలం ఫస్ట్ లుక్ విడుదల చేయబోతున్నారు. కుదిరితే పవన్ కల్యాణ్ చేతులమీదుగా ఫస్ట్ లుక్ లాంచ్ చేయాలనేది యూనిట్ ప్లాన్. అదే వేదికపై విడుదల తేదీని ప్రకటించాలనుకుంటున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది.

నిజానికి ఈ సినిమా విడుదల తేదీని ఇప్పటికే ప్రకటించారు. చాలా రోజుల కిందట టైటిల్ లోగోను విడుదల చేసినప్పుడు.. ఆ లోగో డిజైన్ లో సంక్రాంతి రిలీజ్ అని ప్రింట్ చేశారు. కానీ పవన్ కల్యాణ్ సినిమా కూడా సంక్రాంతికే ఉండడం, సినిమా షూటింగ్ లో జాప్యం కారణంగా రంగస్థలం రిలీజ్ పై అనుమానాలు పెరిగాయి. ఆ అనుమానాలకు ఓ సమాధానం దసరా రోజు రాబోతోంది.


   దసరాకు చెర్రీ సినిమాపై క్లారిటీ