బాబుతోనే గేమ్స్ ఆడిన తిరుమల అర్చకులు

Header Banner

బాబుతోనే గేమ్స్ ఆడిన తిరుమల అర్చకులు

  Sat Sep 23, 2017 22:25        India, Telugu

తిరుమలలో అర్చకుల మధ్య వర్గపోరు మరోసారి బహిర్గతమైంది. ఈసారి ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలోనే రెండు వర్గాల వారు తమ ఆధిపత్య ప్రదర్శనకు దిగారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో పట్టువస్త్రాలు సమర్పించేందుకు వచ్చిన చంద్రబాబుకు… తలపాగా చుట్టే సమయంలో అర్చకుల మధ్య వివాదం తలెత్తెంది. బ్రహ్మోత్సవాల కంకణదారుడైన వేణుగోపాల్ దీక్షితులు తొలుత చంద్రబాబుకు తలపాగా చుట్టేందుకు వచ్చారు. అయితే అదే సమయంలో  ఆలయ ప్రధానార్చకుడు రమణదీక్షితులు అడ్డుపడ్డారు. వేణుగోపాల్ దీక్షితుల నుంచి తలపాగాను లాక్కున్నారు. ఇలా రెండుసార్లు ప్రయత్నించడంతో వేణుగోపాల్‌ దీక్షితులు చేసేది లేక తలపాగాను రమణదీక్షితులు చేతికే ఇచ్చేశారు. వెళ్లి పక్కన నిలబట్టారు.

చంద్రబాబుకు తలపాగా చుట్టేందుకు ఇద్దరు అర్చకులు పోటీ పడిన సమయంలో అక్కడ వాతావరణం కాస్త వేడెక్కింది. ఒకరినొకరు సీరియస్‌గా చూసుకున్నారు రమణదీక్షితులు, వేణుగోపాల్‌ దీక్షితులు. చంద్రబాబు ముందే ఇలా అర్చకులు ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు ప్రయత్నించడం చర్చనీయాంశమైంది. చాలా కాలంగా తిరుమలలో అర్చకులు గ్రూపులుగా విడిపోయి కుమ్ములాటలకు దిగుతున్నారన్న విమర్శలు ఉన్నాయి.   Babu - Tirumala