అనసూయకి “ఫిదా” అయిన మంచు లక్ష్మి

Header Banner

అనసూయకి “ఫిదా” అయిన మంచు లక్ష్మి

  Sat Sep 23, 2017 22:06        India, Telugu

తెలుగు బుల్లి తెర పై ఇప్పుడు రియాలిటీ షో లు, టీవి షో లు చాలా వస్తునాయ్. పెద్ద పెద్ద స్టార్స్ అయిన ఎన్టీఆర్, నాగార్జున, రానా లాంటి వారు బుల్లి తెర పై తమ టాలెంట్ ని చాటుతున్నారు. అప్పట్లో మంచు లక్ష్మి కూడా “లక్ష్మి టాక్ షో” అని ఒక ప్రోగ్రామ్ కి హోస్ట్ చేసింది. ఇదిలా ఉంటె ఇప్పుడు మంచు లక్ష్మి ఒక టీవి షో ని నిర్మించే పనిలో ఉందట. అవును జెమినీ ఛానల్ లో ఒక టీవి షో ని లక్ష్మి మంచు ప్రొడ్యూస్ చేస్తుందట. ఈ షో కి “ఫిదా” అని పేరు పెట్టారట టీం.

అయితే ఈ షో కి హోస్ట్ గా మంచు లక్ష్మి ఉండట్లేదు. బుల్లి తెర హాట్ యాంకర్ అయిన అనసూయ ఈ షో ని హోస్ట్ చేస్తుంది. మొదట చాలా మంది యాంకర్స్ ని చూసిన మంచు లక్ష్మి ఫైనల్ గా అనసూయ కి ఫిదా అయ్యి ఈ “ఫిదా” షో కి తనని యాంకర్ గా తీసుకుంది. మరి ఇప్పటికే మూవీ ప్రొడ్యూసర్ గా, బుల్లి తెర యాంకర్ గా సక్సెస్ అయిన మంచు లక్ష్మి టీవి షో ప్రొడ్యూసర్ గా ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.   Anasuya - Manchu lakshmi