కువైట్ లోని ఖరాఫీ నేషనల్ లో పనిచేస్తూ తీసివేయబడిన కార్మికుల సమస్య 2 వారాలలో పరిష్కారం... కువైట్ మంత్రిణి హింద్ అల్ సాహీబ్... ఈ రోజు లోపల కార్మికులు వారి వివరాలు ఎంబసీ కి పంపవలసింది గా ఎంబసీ అభ్యర్ధన.

Header Banner

కువైట్ లోని ఖరాఫీ నేషనల్ లో పనిచేస్తూ తీసివేయబడిన కార్మికుల సమస్య 2 వారాలలో పరిష్కారం... కువైట్ మంత్రిణి హింద్ అల్ సాహీబ్... ఈ రోజు లోపల కార్మికులు వారి వివరాలు ఎంబసీ కి పంపవలసింది గా ఎంబసీ అభ్యర్ధన.

  Sat Sep 23, 2017 11:29        Associations, Embassy Row, Kuwait, Telugu

కువైట్ లోని ఖరాఫీ నేషనల్ లో పనిచేస్తూ తీసివేయబడిన కార్మికుల సమస్య 2 వారాలలో పరిష్కారం... కువైట్ మంత్రిణి హింద్ అల్ సాహీబ్... ఈ రోజు లోపల కార్మికులు వారి వివరాలు ఎంబసీ కి పంపవలసింది గా ఎంబసీ అభ్యర్ధన.

గత వారం భారత విదేశాంగ సహాయ మంత్రి MJ అక్బర్ పర్యటన సందర్భం గా కువైట్ సోషల్ అఫైర్స్ మరియు లేబర్ మంత్రిణి హింద్ అల్ సాహీబ్ తో జరిపిన చర్చల్లో ఖరాఫీ నేషనల్ లో పనిచేస్తూ తీసివేయబడిన కార్మికుల సమస్యపై సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ చర్చలో భాగంగా మంత్రిణి హింద్ అల్ సాహీబ్ సానుకూలం గా స్పందించి సమస్యను 2 వారాలలో పరిష్కరిస్తామని తెలిపారు. సమస్యల తో ఉన్నవారి పూర్తి వివాలు తనకు ఈ వారం అది లేక సోమ వారం లోపల పంపవలసింది గా ఎంబసీ అధికారులకు తెలిపారు.

ఈ సందర్భం గా ఎంబసీ రెండవ సెక్రటరీ సిబి గారు ఈ విషయాని అందరి తెలుప వలసినది గా ఒక ప్రకటన లో తెలియ చేసారు. ఇంతకు మునుపు చాలామంది వారి వివరాలు తెలిపారు కాని దానిలో పూర్తి వివరాలు లేవని, మొన్న మంత్రి గారికి ఇచ్చిన నివేదికలో కుడా వివరాలు లేవని తెలిపారు. అయితే ఈ రోజు లేదా రేపటి లోగా ఈ క్రింద ఇవ్వబడిన పూర్తి వివరాల ప్రకారం వారి వారి వివరాలు తెలుపుతూ ఎంబసీ మెయిల్ labour@indembkwt.org  కు పంపవలసింది గా అబ్యర్ధించారు.

ఈమెయిలు లో పంపవలసిన వివరాలు:

పేరు: Name

పాస్పోర్ట్ నెంబరు: Passport No

సివిల్ ID నెంబరు: Civil ID

క్యాంపు: Camp

ప్రాజెక్ట్ కోడ్: Project Code

జాబ్ ప్రొఫైల్: Job Profile

రెసిడెన్సీ స్టేటస్ వివరాలు: Residency Validity Status

తిరిగి ఇండియాకు వెళ్ళాలా లేక రిలీజ్ కావాలా: Want Return or Want Release

మిగతా వివరాలు ఏమైనా ఉంటె: Remarks

పై వివరాలు పూర్తి చేసి ఎంబసీ మెయిల్ కు ఈ రోజు లేదా రేపటి లోగా అనగా ఈ నెల 23 లేదా 24 లోపల పంపండి.

ఈ కంపినిలో మోత్తం తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు 100 మందికి పైగానే ఉన్నారు. వీళ్ళలో ఎవరికైనా మెయిల్స్ పంపడానికి ఏదైనా సహాయం లేదా వివరాలు కావలసిన వారు కువైట్ ఎన్నారైస్ ను సంప్రదించండి. మా నెంబరు “60 90 54 70”  

ఈ వార్త చదివిన వారు తప్పక మీ స్నేహితులకు షేర్ చేసి ఈ కంపెనీలో పనిచేసే వారందరికి చేరే విధం గా సహాయ పడండి. వీరంతా సుమారు 8 నెలలు గా జీతాలు లేక, తిండి కి డబ్బు లు లేక, రెసిడెన్స్ లేక చలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వం వారిని ఆదుకోవడానికి ముందుకు వచ్చింది. కాబట్టి ఏ ఒక్క వ్యక్తి వారి వివరాలు ఎంబసీ కి తెలుపడం లో విఫలం కాకుండా చూడవలసిన భాద్యత మన అందరిది.

   కువైట్ లోని ఖరాఫీ నేషనల్ లో పనిచేస్తూ తీసివేయబడిన కార్మికుల సమస్య 2 వారాలలో పరిష్కారం