అఫ్గ‌నిస్తా‌న్‌లోని మార్కె‌ట్‌లో పేలిన బాంబు...

Header Banner

అఫ్గ‌నిస్తా‌న్‌లోని మార్కె‌ట్‌లో పేలిన బాంబు...

  Sun Sep 17, 2017 20:07        Telugu, World

ఆదివారం ద‌క్షిణ‌ ఆఫ్గనిస్తాన్లో మొబైల్ ఫోన్ మార్కెట్లో పేలుడు సంబ‌వించింది. ఈ ఘ‌ట‌న‌లో నలుగురు మృతి చెందగా, మరో 14 మంది గాయపడ్డారని అదికారులు తెలిపారు. మొబైల్ ఫోన్లకు మ్యూజిక్ మరియు వీడియోలను డౌన్ లోడ్ చేయటానికి వెళ్ళే ఒక మార్కెట్లో మధ్యాహ్నం సమయంలో పేలుడు జరిగిందని, ఖోస్ట్ ప్రావిన్సియల్ పోలీసు చీఫ్ ఫైజల్లా ఖైరాత్ వెల్ల‌డించారు. ఈ ఘ‌ట‌న‌పై పూర్తి ద‌ర్యా‌ప్తు చేసి నిందితుల‌ను త్వ‌ర‌లోనే ప‌ట్టు‌కుంటామ‌ని చెప్పా‌రు. ఈ పేలుడు \"రిమోట్ కంట్రోల్డ్ బాంబ్\" వల్ల సంభవించినట్లు ఖైరాత్‌ తెలిపారు.   Bomdsmash-Afganistanmarket