టెక్నాలజీ ఉపయోగిస్తే ఆర్టీసీలో మంచి ఫలితాలు వస్తాయి: చంద్రబాబు

Header Banner

టెక్నాలజీ ఉపయోగిస్తే ఆర్టీసీలో మంచి ఫలితాలు వస్తాయి: చంద్రబాబు

  Tue Sep 12, 2017 22:54        India, Technology, Telugu

 టెక్నాలజీ ఉపయోగిస్తే ఆర్టీసీలో మంచి ఫలితాలు వస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చామని సీఎం చెప్పారు. ఆర్టీసీ కార్మికులందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. రిటైర్‌ అయిన కార్మికులకు తెల్లరేషన్‌కార్డులు ఇస్తామన్నారు. ఆక్యుపెన్సీ రేటు 75 శాతానికి పెంచడం అభినందనీయమని సీఎం తెలియజేశారు. రోజూ 75 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారని చంద్రబాబు తెలిపారు. ఎలక్ట్రిక్‌ బస్సులు వస్తే కాలుష్యం తగ్గుతుందని.. ప్రైవేటు ట్రావెల్స్‌కు ధీటుగా ఆర్టీసీ తయారు కావాలని చంద్రబాబు అన్నారు.   టెక్నాలజీ ఉపయోగిస్తే ఆర్టీసీలో మంచి ఫలితాలు వస్తాయి: చంద్రబాబు