గల్ఫ్‌ బాధితులను ఎలా ఆదుకుందాం!

Header Banner

గల్ఫ్‌ బాధితులను ఎలా ఆదుకుందాం!

  Tue Sep 12, 2017 21:32        APNRT, India, Telugu

‘ఈనాడు’లో గల్ఫ్‌ కథనాలపై సీఎం చంద్రబాబు స్పందన
వెంటనే కార్యాచరణరూపొందించాలని ఆదేశం
ఈనాడు, అమరావతి: గల్ఫ్‌లో ఇబ్బందులుపడుతున్న తెలుగువారిని ఆదుకోవడానికి కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ‘గల్ఫ్‌లో తెలుగోడు’ శీర్షికన ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనాలపై సోమవారం సీఎం స్పందించారు. వెంటనే అక్కడున్న తెలుగువారి పరిస్థితులు తెలుసుకొని వారిని ఏ విధంగా ఆదుకోవాలి, బాధితులకు ఎలా సాయం అందించాలి, అక్కడున్న సమస్యలేంటి అనే అంశాలపై చర్చించి ఒక కార్యాచరణ ప్రణాళికలను వెంటనే సిద్ధం చేయాలని సీఎం కార్యాలయ ముఖ్యకార్యదర్శి సతీష్‌చంద్ర ఆదేశించారు. దీంతో ఆంధ్రప్రదేశ్‌ ప్రవాసాంధ్రుల సొసైటీ(ఏపీఎన్‌ఆర్టీ) అధ్యక్షులు డాక్టర్‌ రవి వేమూరి, ముఖ్యకార్యనిర్వహణాధికారి కోగంటి సాంబశివరావులతో సతీష్‌చంద్ర సుదీర్ఘంగా చర్చించారు.
గల్ఫ్‌లో ప్రస్తుత సంక్షోభానికి ప్రధాన కారణం చమురు ధరల పతనమేనని, దీంతో కొన్ని కంపెనీల్లో ఉద్యోగాలు కోతపడటంతో అక్కడున్న తెలుగువారు ఇబ్బందులు పడుతున్నారని రవి, సాంబశివరావులు ప్రభుత్వానికి వివరించారు. ప్రభుత్వం తరఫున సహకారం అందించడానికి వారు కొన్ని ప్రతిపాదనలు కూడా చేసినట్లు సమాచారం. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం మరో దఫా చర్చించి గల్ఫ్‌ బాధితుల సమస్యపై ప్రభుత్వపరంగా తీసుకోవాల్సిన చర్యలపై ఒక నిర్ణయం తీసుకోనున్నారు.   గల్ఫ్‌ బాధితులను ఎలా ఆదుకుందాం!