వాహనాల రిజిస్ట్రేషన్‌పై ప్రభుత్వ సర్క్యులర్‌‌కు బ్రేక్..!

Header Banner

వాహనాల రిజిస్ట్రేషన్‌పై ప్రభుత్వ సర్క్యులర్‌‌కు బ్రేక్..!

  Tue Sep 12, 2017 20:29        Telugu, World

వాహనాల రిజిస్ట్రేషన్‌కు డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి చేస్తూ తమిళనాడు ప్రభుత్వం ఇచ్చిన సర్క్యులర్‌పై మద్రాసు హైకోర్టు మంగళవారంనాడు స్టే ఇచ్చింది. ఫెడరేషన్ ఆప్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ ఎం.దురైస్వామి ఈ తాత్కాలిక స్టే ఇచ్చారు. నాలుగు వారాల్లోగా ప్రభుత్వం వివరణ ఇవ్వాలని ఆయన ఆదేశించారు. వాహన కొనుగోలుదారు వద్ద సరైన డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాన్ని రిజిస్టర్ చేయరాదని సంబంధిత అధికారులకు గత నెల 24న ట్రాన్స్‌పోర్ట్, రోడ్ సేఫ్టీ కమిషనర్ ఆదేశాలిచ్చారు. రాష్ట్రంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదల నేపథ్యంలో ప్రభుత్వం ఈ సర్క్యులర్ ఇచ్చినట్టు ఆయన తెలిపారు. మోటార్ వెహికల్ యాక్ట్‌లోని 5వ సెక్షన్ ప్రకారం డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి డీలర్లు వాహనాన్ని డెలివర్ చేయరాదని అన్నారు. ఇందుకు భిన్నంగా ఎవరికైనా అమ్మినట్టు తేలితే డీలర్‌పై కేసు నమోదు చేస్తామని, జైలు, జరిమానా, లేదా రెండూ కూడా విధించడం జరుగుతుందని చెప్పారు. కాగా, ఈ సర్క్యులర్‌ పక్షపాతంతో కూడుకున్నదని, రాష్ట్రంలోని మోటార్ వెహికల్స్ డీలర్లపై తీవ్ర ప్రభావం చూపుతుందని పిటిషనర్లు తమ వాదన వినిపించారు. ఈ సర్క్యులర్‌ను కొట్టివేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు.   Vehicle-registration-break