వేర్పాటువాద నేత యాసిన్‌ మాలిక్‌ అరెస్ట్‌

Header Banner

వేర్పాటువాద నేత యాసిన్‌ మాలిక్‌ అరెస్ట్‌

  Thu Sep 07, 2017 20:49        Telugu, World

జ‌మ్మూకాశ్మీర్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌(జేకేఎల్‌ఎఫ్‌) చీఫ్‌ యాసిన్‌ మాలిక్‌ను గురువారం శ్రీనగర్‌లో పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం  ఢిల్లీలోని ఎన్‌ఐఏ ప్రధాన కార్యాలయం వద్ద హురియత్, జెకెఎల్ఎఫ్ నేతలు ఆందోళనకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

        ఈ నేపథ్యంలో యాసిన్‌ మాలిక్‌ను ముందస్తుగా అరెస్ట్‌ చేసిన పోలీసులు ఆయనను ఈ నెల 11వరకూ జైలులో ఉంచనున్నట్లు తెలిపారు. మరోవైపు హురియత్ నేత మిర్వాజ్ ఉమర్ ఫరూక్‌‌ను గృహ నిర్భంధంలో ఉంచారు. కాగా ఎన్ఐఏ అధికారులు వేధిస్తున్నారంటూ, అందుకు  నిరసనగా రేపు ఢిల్లీలో ధర్నాకు పిలుపునిచ్చారు.అయితే కాశ్మీర్‌లో ఇటీవల కాలంలో వేర్పాటువాదులకు మనీలాండరింగ్ ద్వారా నిధులు సరఫరా అవుతున్నాయనే సమాచారంపై ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆ చర్యలను నిరసనగా జేకేఎల్‌ఎఫ్‌, హురియత్‌ సంయుక్తంగా నిరసన కార్యక్రమం చేపట్టాయి.   Yasinmalik-Arrest