కువైట్ లోని ఇండియన్ ఎంబసీ “కమ్యూనిటి వెల్ఫేర్ ఫండ్” చార్జీల పెంపు... ప్రవాసులకు మెరుగైన సేవల కొరకు...

Header Banner

కువైట్ లోని ఇండియన్ ఎంబసీ “కమ్యూనిటి వెల్ఫేర్ ఫండ్” చార్జీల పెంపు... ప్రవాసులకు మెరుగైన సేవల కొరకు...

  Sun Sep 03, 2017 12:28        Associations, Education, Helping Hand, Kuwait, Telugu

కువైట్ లోని ఇండియన్ ఎంబసీ “కమ్యూనిటి వెల్ఫేర్ ఫండ్” చార్జీల పెంపు... ప్రవాసులకు మెరుగైన సేవల కొరకు... 

ఇండియన్ ఎంబసీ ఆధ్వర్యం లోని “ఇండియన్ కమ్యూనిటి వెల్ఫేర్ ఫండ్” చార్జీలను సెప్టెంబర్ 1 వ తేది నుండి పెంచింది. ఈ చార్జీలు ప్రతి సేవకు 750 ఫిల్స్ ను ఇకపై వసూలు చేయనుంది. ఇంతకు మునుపు ఈ చార్జీలు 500 ఫిల్స్ గా ఉండేది.   

ఈ ICWF ను 2009 సంవత్సరం లో ప్రారంబించారు. అప్పుడు ఈ చార్జీలు 1 KD గా వుండేది. 2014 నుండి 500 ఫిల్స్ కు తగ్గించి తిరిగి ఇప్పుడు 750 ఫిల్స్ కు పెంపుదల చేసారు. ఈ ఫండ్ ముఖ్య ఉద్దేశం కువైట్ లో ఉన్న ప్రవాసులకు ఆపదల్లో ఉన్నవారికి, అత్యవసర పరిస్తితుల్లో ఉన్నవారికి, కమ్యూనిటి వెల్ఫేర్ కొరకు, ఆపదల్లో ఆశ్రయం పొందేదుకు వచ్చే ప్రవసులకోసం  ఎంబసీ నిర్వహిస్తున్న వసతి గృహానికి  మరియు కౌన్సులర్ సర్వీసెస్ ల కొరకు వాడుతారు.

ఈ ICWF కు భారత ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయం అందదు. కువైట్ లో ఉన్న 9.5 లక్షల భారతీయుల ఎంబసీ లో పాస్స్పోర్ట్, ముఖ్య పత్రాల గుర్తింపు నమోదు మరియు ఇతర సర్వీస్ లకోసం వచ్చే వారిపై వాటి చార్జీల తో పాటు అదనం గా 750 ఫిల్స్ వాసులు చేస్తారు. ఈ మొతాన్ని కువైట్ లో ఉన్న వారి కోసమే అవసరాన్ని అనుసరించి వాడుతారు.

   కువైట్ లోని ఇండియన్ ఎంబసీ “కమ్యూనిటి వెల్ఫేర్ ఫండ్” చార్జీల పెంపు... ప్రవాసులకు మెరుగైన సేవల కొరకు...