త్యాగానికి ప్రతీక బక్రీద్... ముస్లిం ప్రజలు భక్తి ప్రపత్తులతో జరుపుకునే పండుగ... ముస్లిమ్ సోదరులకు శుభాకాంక్షలతో

Header Banner

త్యాగానికి ప్రతీక బక్రీద్... ముస్లిం ప్రజలు భక్తి ప్రపత్తులతో జరుపుకునే పండుగ... ముస్లిమ్ సోదరులకు శుభాకాంక్షలతో

  Fri Sep 01, 2017 03:08        Devotional, Kuwait, Telugu

ఈద్ అల్-అజ్ హా (అరబ్బీ: عيد الأضحى ‘Īd ul-’Aḍḥā) ఈదుల్ అజ్ హా లేదా ఈదుజ్జుహా లేదా బఖర్ ఈద్ లేదా బక్రీదు. అల్లాహ్ ఆదేశం ప్రకారం ఇబ్రాహీం ప్రవక్త తన కుమారుడైన ఇస్మాయీల్ను బలి ఇవ్వడాని తీసుకెళ్ళే సాంప్రదాయాన్ని స్మరిస్తూ ప్రపంచంలోని ముస్లింలు ఈ పండుగను జరుపు కొంటారు. ఈ పండుగకు ప్రామాణికం ఖురాన్. (ఇరాన్ లో ముస్లింలు దీనిని 3వ అతి ముఖ్యమైన పండుగగా జరుపుకొంటారు.) ఈదుల్ ఫిత్ర్ (రంజాన్) లో లాగ, బక్రీదు పండుగనాడు కూడా ప్రార్థనలు ఖుత్బా (ధార్మిక ప్రసంగం) తో ప్రారంభమౌతుంది.

ఇస్లామీయ కేలండర్ ప్రకారం 12వ నెల యైన జుల్ హజ్జా 10వ తేదీన ఈ పండుగ జరుపుకొంటారు. ఈ పండుగ 3 రోజుల పాటు జరుపుకుంటారు. ఈ నెలలోనే హజ్ తీర్థయాత్రగూడా చేస్తారు. ఈ యాత్రకొరకు సౌదీ అరేబియా లోని మక్కా నగరానికి వెళ్ళి మస్జిద్-అల్-హరామ్ లోని కాబా చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేస్తారు. ఈ పండుగ రంజాన్ పండుగ జరిగిన 70 రోజుల తరువాత జరుపుకుంటారు.

ఇస్లామీయ కేలండర్ లో ఈదుల్ అజ్ హా ఒకే దినంలో వచ్చిననూ గ్రెగేరియన్ కేలండరులో తేదీలు మారుతాయి. దీనికి కారణం ఇస్లామీయ కేలండర్ చంద్రమాసాన్ననుసరించి మరియు గ్రెగేరియన్ కేలండర్ సూర్యమాసాన్ననుసరించి వుంటుంది. చంద్రమాన సంవత్సరం, సూర్యమాన సంవత్సరం కంటే దాదాపు పదకొండు రోజులు తక్కువ.[2] ప్రతి సంవత్సరం ఈదుల్ అజ్ హా ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో రెండు గ్రెగేరియన్ కేలండర్ దినములలో సంభవిస్తుంది, దీని కారణం అంతర్జాతీయ దినరేఖ ననుసరించి వివిధ ప్రాంతాలలో చంద్రవంక వేర్వేరు దినాలలో కానరావడమే.

'ఇస్మాయీల్' ఇబ్రాహీం మరియు 'హాజిరా ల కుమారుడు. భారతంలో కర్ణుడు లాంటి ప్రవక్త.ఇబ్రాహీం గారు దేవుని అనుమతితోనే ఇష్మాయిల్ హాజరా లను ఎడారిలో వదిలేస్తాడు. అల్లాహ్ ఇతని దప్పిక తీర్చటం కోసం హాజరా (హాగరు) ప్రార్థన విని నీళ్ళ ఊటను పుట్టిస్తాడు. అదే జమ్ జమ్ బావిగా స్థిరపడింది. ఇస్మాయిల్ను యుక్తవయసులో ఇబ్రాహీం దేవునికి బలి ఇవ్వాలని ప్రయత్నిస్తాడు. అయితే దేవుడు ఇస్మాయిల్ కు బదులుగా ఒక గొర్రెను బలి ఇమ్మని చెబుతాడు. ఇతని సంతానం నుండే మహమ్మదు ప్రవక్త జన్మించారు. యూదులు క్రైస్తవులు బలి ఇవ్వటానికి తీసుకెళ్ళింది ఇస్ హాక్ (ఇస్సాకు) ను అంటారు. ఈ ఖుర్బానీ సంప్రదాయాన్ని స్మరిస్తూ ముస్లింలు ఈదుల్-అజ్ హా (బక్రీదు ) పండుగ జరుపుకుంటారు.

ఇస్లాంలోని ఐదు ప్రధాన సూత్రాలలో ఒకటైన హజ్‌ ‌తీర్థయాత్రను ముస్లింలు చేయాల్సివుంటుంది. ఈనెల ప్రారంభంలోనే ముస్లిం ప్రజలు భక్తి ప్రపత్తులతో హజ్ తీర్థయాత్రకు బయలుదేరతారు.

హజ్ యాత్రకొరకు సౌదీ అరేబియా‌లోని మక్కా నగరానికి చేరుకుని మస్జిద్..ఉల్..హరామ్‌లోవున్న కాబా చుట్టూ 7 ప్రదక్షిణలు చేసి మసీదులో ప్రార్థనలు చేస్తారు. ఈ మసీదు కాబా గృహం చుట్టూ ఉంది. ప్రపంచంలోని ముస్లింలందరూ కాబా వైపు తిరిగి నమాజు (ప్రార్థనలు) చేస్తారు. దీనినే ఖిబ్లా అని కూడా అంటారు.

హజ్ తీర్థయాత్రకు వెళ్ళినవారు మక్కానుండి మదీనా (ముహమ్మద్ (సొ.అ.స) ప్రవక్త గోరీ ఉన్ననగరం)ను సందర్శిస్తారు. అల్లాహ్ ఆదేశానుసారం ఇబ్రహీం (సొ.అ.స) తన ఏకైక పుత్రుడైన ఇస్మాయిల్‌ను బలి ఇవ్వడానికి సిద్ధమౌతారు. ఆ సంప్రదాయాన్ని స్మరిస్తూ ముస్లింలు ఈ బక్రీద్ పండుగను జరుపుకుంటారు.

రంజాన్‌లాగే బక్రీద్ పండుగను కూడా ఖుద్బా (ధార్మిక ప్రసంగం)తో ఈద్గా‌లో సామూహిక ప్రార్థనలు జరుపుతారు. ఆతర్వాత వారు నెమరు వేసే జంతువులను (ఒంటె, మేక, గొర్రె, ఎద్దు) మాత్రమే ఖుర్బానీ (బలి) ఇస్తారు.

బలి ఇచ్చిన తర్వాత దానిని మూడు భాగాలుగా విభజించి ఒక భాగాన్ని పేదలకు, మరొక భాగాన్ని బంధువులకు పంచుతారు. ఇంకొక భాగాన్ని తమ కోసం ఉంచుకుంటారు. ముస్లింలు త్యాగానికి ప్రతీకగా ఈ బక్రీద్ పండుగను జరుపుకుంటారు.

సాంప్రదాయాలు మరియు సంస్కృతి

స్త్రీలు, పురుషులూ, పెద్దలు మరియు పిల్లలూ క్రొత్త బట్టలు ధరించడం.

ఈద్ నమాజ్ కు తయారు గావడం.

ఈద్ గాహ్ లలో ఈద్ నమాజ్ ను ఆచరించడం.

ఖుర్బానీ ఇవ్వడం (పెంపుడు జంతువులు గొర్రె, మేక, ఎద్దు లేదా ఒంటె లను అల్లాహ్ మార్గమున ఇబ్రాహీం ప్రవక్త సంస్మణార్థం బలి ఇవ్వడం) . ఈ ఖుర్బానీ ఇవ్వబడిన మాంసముము మూడు భాగాలు చేసి ఒక భాగము తమకొరకు ఉంచుకొని, రెండవభాగము చుట్టములకునూ మరియు స్నేహితులకునూ, మూడవభాగము పేదలకు పంచుతారు.

ఈద్ ముబారక్ శుభాకాంక్షలు ఒకరినొకరు తెలుపుకోవడం.


   త్యాగానికి ప్రతీక బక్రీద్... ముస్లిం ప్రజలు భక్తి ప్రపత్తులతో జరుపుకునే పండుగ... ముస్లిమ్ సోదరులకు శుభాకాంక్షలతో