దీనస్థితిలో ఓమాన్ నుండి స్వదేశం చేరిన వలసకార్మికులు... శ్రీకాకుళం జిల్లా చెందిన 20 మంది, తెలంగాణ చెందినవారు ఇద్దరు

Header Banner

దీనస్థితిలో ఓమాన్ నుండి స్వదేశం చేరిన వలసకార్మికులు... శ్రీకాకుళం జిల్లా చెందిన 20 మంది, తెలంగాణ చెందినవారు ఇద్దరు

  Tue Aug 29, 2017 18:48        Associations, Gulf News, Telugu

దీనస్థితిలో ఓమాన్ నుండి స్వదేశం చేరిన వలసకార్మికులు... శ్రీకాకుళం జిల్లా చెందిన 20 మంది, తెలంగాణ చెందినవారు ఇద్దరు.

మస్కట్ చిరు మెగా యూత్ ఫోర్స్ సహాయం

ఓమాన్ లో  రోడ్డునపడ్డ 200 మంది తెలుగు కార్మికులు

ఉద్యోగాలు ఊడిపోయి ఉట్టిచేతులతో ఇంటికి చేరిన గల్ఫ్ వలసజీవులు

మస్కట్ నుండి హైదరాబాద్ ఏర్ పోర్ట్ కు ఇద్దరు, విశాఖపట్నం ఏర్ పోర్ట్ కు 20 మంది చేరుకున్నారు

ఓమాన్ దేశంలోని సోహార్ నగరంలో 'పెట్రాన్ గల్ఫ్' అనే కంపెనీ యాజమాన్యం మోసానికి 900 మంది భారతీయ కార్మికులు బలయ్యారు. కంపెనీ మూతపడటంతో కార్మికులు గత నాలుగు నెలలుగా జీతాలురాక, తిండిలేక అలమటిస్తున్నారు. వీరిలో 30 మంది తెలంగాణ, 170 మంది ఆంధ్రప్రదేశ్ కు చెందినవారున్నారు. గత ఎనిమిది నుండి పదేళ్లుగా ఈ కంపెనీలో పనిచేస్తున్న వీరికి నాలుగు నెలల జీతం, గ్రాట్యుటీ కలిపి ఒక్కొక్కరికి రూ.3 నుంచి 4 లక్షల రూపాయల బకాయిలు రావాల్సి ఉన్నది. కార్మికులు తమకు రావాల్సిన బకాయిలను రాబట్టుకోవడానికి లేబర్ కోర్టులో కేసు పోరాడాడటానికి మస్కట్ లోని ఇండియన్ ఎంబసీ పేరిట పవర్ ఆఫ్ అటార్నీ అధికారం ఇచ్చారు.

ఓమాన్ దేశ రాజధాని మస్కట్ లోని ఇండియన్ ఎంబసీ వీరందరికి ఉచిత విమాన టికెట్లు సమకూర్చింది. మంగళవారం (29.08.2017) న మస్కట్ నుండి హైదరాబాద్ ఏర్ పోర్ట్ కు ఇద్దరు, విశాఖపట్నం ఏర్ పోర్ట్ కు 20 మంది వలసకార్మికులు చేరుకున్నారు. మస్కట్ చిరు మెగా యూత్ ఫోర్స్ ప్రతినిధులు చందక రాందాస్, పోల్సాని లింగయ్యలు 79 మంది తెలుగు కార్మికులకు చేతి ఖర్చులకు ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు అందజేసినట్లు వారు తెలిపారు.

తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా కొడిమ్యాలకు చెందిన చెన్న వెంకటేశ్వర్లు (ఓమాన్ మొబైల్ నెం. +968 9701 3974, ఇండియా మొబైల్ నెం. +91 95506 87385), నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం మెంట్రాజుపల్లి కి చెందిన సంగెమ్ చిన్నయ్య (ఓమాన్ మొబైల్ నెం. +968 9698 3929, ఇండియా మొబైల్ నెం. +91 98498 26805) మస్కట్ నుండి హైదరాబాద్ కు ఓమాన్ ఏర్ వేస్ ప్లయిట్ నెం. WY-235 ద్వారా మంగళవారం  ఉదయం చేరుకున్నారు. తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షులు నంగి దేవేందర్ రెడ్డి, ప్రోటోకాల్ అధికారులతో కలిసి వీరికి హైదరాబాద్ ఏర్ పోర్ట్ లో స్వాగతం పలికి, ఓదార్చి ధైర్యం చెప్పారు. తమ సమస్యల గురించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో, ఇండియన్ ఎంబసీ తో సంప్రదింపులు జరిపి స్వదేశానికి రప్పించిన దేవేందర్ రెడ్డికి కార్మికులు కృతఙ్ఞతలు తెలిపారు. వీరు హైదరాబాద్ ఏర్ పోర్ట్ నుండి స్వగ్రామాలకు వెళ్ళడానికి తెలంగాణ ఎన్నారై విభాగం అధికారి చిట్టిబాబు బస్ చార్జీలు అందజేశారు.

ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం ప్రాంతానికి చెందిన 20 మంది వలస కార్మికులు సూరపాటి తుంబనాధం, మిట్టన పొట్టయ్య, సీరపు వాసుదేవ్, పైలా గురునాథ్ రెడ్డి, రెయ్యా త్రినాథ్ రెడ్డి, వాసుదేవులు రెడ్డి, గాడి గురుమూర్తి, సేతి మురళి, జెడిల పురుషోత్తం, గోవిందు రామయ్య, బడే కోటేశ్వర్ రావు, యెదురు మోహన రావు, ఎళ్ళుమల్ల వీరాస్వామి, రంగల కురేష్ రెడ్డి, కూన రజయారెడ్డి, దువ్వు గణేష్ రెడ్డి, పేలి డంబారు, కొర్లపు అశోక్ కుమార్, దల్లి మాధవ రెడ్డి, వేణు రెడ్డి లు మస్కట్ నుండి విశాఖపట్నానికి (వయా ముంబయి) ఏర్ ఇండియా ప్లయిట్ నెం. AI-651 ద్వారా మంగళవారం మధ్యాహ్నం చేరుకున్నారు.

రాష్ట్ర ప్రభుత్వాలు పునరావాసం కల్పించాలి

కంపెనీ యాజమాన్యం మోసానికి బలై వాపస్ పంపివేయబడ్డ వలసకార్మికులను తెలంగాణ, ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు పునరావాసం కల్పించాలని, సంక్షేమ పథకాలలో లబ్ధిదారులుగా ఎంపికచేసి ఆదుకోవాలని  తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షులు నంగి దేవేందర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కార్మికులకు ఉచిత విమాన ప్రయాణ టికెట్లు అందించిన  మస్కట్ లోని భారత రాయబారి ఇంద్రామని పాండే కు దేవేందర్ రెడ్డి కృతఙ్ఞతలు తెలిపారు   దీనస్థితిలో ఓమాన్ నుండి స్వదేశం చేరిన వలసకార్మికులు... శ్రీకాకుళం జిల్లా చెందిన 20 మంది, తెలంగాణ చెందినవారు ఇద్దరు