గుంటూరులో కుండపోత వర్షం

Header Banner

గుంటూరులో కుండపోత వర్షం

  Tue Aug 22, 2017 20:25        India, Telugu

గుంటూరు నగరంలో కుండపోతగా వర్షం కురిసింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈదురు గాలులతో కూడిన ఈ భారీ వర్షంతో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పలు చోట్ల ట్రాన్స్‌ఫార్మర్లు పేలిపోయాయి. వాతావరణంలో ఒక్కసారిగా మార్పు వచ్చి మేఘాలు దట్టంగా కమ్ముకున్నాయి. ఈ వర్షంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. మురికి నీరు వర్షపు నీటితో కలిసి రోడ్లపైకి చేరడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.   గుంటూరులో కుండపోత వర్షం