సౌదీ లో కష్టాలు భరించలేక ఇంటి నుండి పారి పోయి పని దొరకక ఇండియాకు రాలేక నానా అవస్ధలు పడుతున్న నంద్యాల వాసి, పరిష్కారం దిశగా YSRCP గల్ఫ్ కన్వీనర్

Header Banner

సౌదీ లో కష్టాలు భరించలేక ఇంటి నుండి పారి పోయి పని దొరకక ఇండియాకు రాలేక నానా అవస్ధలు పడుతున్న నంద్యాల వాసి, పరిష్కారం దిశగా YSRCP గల్ఫ్ కన్వీనర్

  Sun Aug 20, 2017 15:04        Associations, Helping Hand, Kuwait, Telugu

2019 లో గల్ఫ్ సమస్యలను శాశ్వత పరిష్కారం దిశగా ప్రయత్నం... YSRCP గల్ఫ్ కన్వీనర్ ఇలియాస్ బి.హెచ్.

నంద్యాల స్ధానిక నడిగడ్డ వీధిలో నివాసమున్న షేక్ హుస్సేన్ షా, షేక్ ముంతాజ్ , రెండవ కుమారుడు షేక్ అఫ్సర్ (34 )  అఫ్సర్  కు  భార్య  ఇద్దరు  ఆడపిల్లలు  ఒక ఒక  మగ బిడ్డ  ఉన్నారు  4 సం : ముందు జీవనాధారం కొరకు సౌదీ అరేబియా వెళ్లి సౌదీ (సేఠ్) కష్టాలు భరించలేక ఇంటి నుండి పారి పోయి పని దొరకక ఇండియాకు రాలేక అవస్ధలు పడుతున్నాడు. ఉప ఎన్నికల ప్రచార నిమిత్తం ప్రధాన ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి గారికి అఫ్సర్ తల్లి తండ్రులు, తమ కొడుకు సౌదీలో పడుతున్న అవస్ధలు అఫ్సర్ స్వస్ధలం పిలిపించాలని అభ్యర్ధన చేశారు.

ఈ విషయాన్నీ వైకాపా గల్ఫ్ కన్వీనర్ ఇలియాస్ తో మాట్లాడించి అఫ్సర్ ను త్వరగా స్వస్ధలం పిలిపించి ఏర్పాట్లు చేయమని ఆదేశించగా ఇలియాస్ అఫ్సర్ వాళ్ళ ఇంటికి పోయి వివరాలు సేకరించి సౌదీలో ఉన్న అఫ్సర్ తో టెలిఫోన్ మాట్లాడి సౌదీలో ఉన్న వైకాపా కమిటీ వాళ్ళతో మాట్లాడి త్వరగా నంద్యాల పిలిపించి ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు.

ఈ సందర్భముగా ఇలియాస్ మాట్లాడుతూ గల్ఫ్ లో మన తెలుగు ఎన్నో సమస్యలు ఎదురుకుంటున్నారని జగన్  మోహన్ రెడ్డిగారు  ముఖ్యమంత్రి అయితేనే గల్ఫ్ సమస్యలకు శాశ్వత పరిష్కారం అయితది పూర్తీ నమ్మకం గల్ఫ్ ప్రవాసాంధ్రులలో అందరిలో ఉందని తెలిపారు. ఈ కార్యక్రమములో కువైట్ సేవాదళ్ వైస్ ఇంచార్చ్ నాగసుబ్బారెడ్డి, ఎన్ ఆర్ ఐ లు జి.స్. బాబురాయుడు, బాబు భై, జిలాన్, మున్నా, సద్దాం, తదితరులు పాల్గోన్నారు

ఈ విషయం ఇలియాస్ గారి ద్వార తెలుసుకున్న APNRT మిడిల్ ఈస్ట్ మీడియా కో ఆర్డినేటర్ రాజ శేఖర్ సౌది లోని APNRT కో ఆర్డినేటర్స్ ద్వార ఎంబసీ లో మాట్లాడి అక్కడి చట్టపరమైన ఇబ్బందులను తొలగించే ప్రయత్నం చేసి త్వర గా ఇంటికి పంపే ఏర్పలు చేస్తామని తెలిపారు. ఇంటికి త్వరగా రావటం లేదా రాకపోవటం అనేది అతని యజమాని అతని పై పెట్టిన కేసు లపై ఆధార పడి ఉంటుంది.


   సౌదీ లో కష్టాలు భరించలేక ఇంటి నుండి పారి పోయి పని దొరకక ఇండియాకు రాలేక నానా అవస్ధలు పడుతున్న నంద్యాల వాసి, పరిష్కారం దిశగా YSRCP గల్ఫ్ కన్వీనర్