అమెరికా లో చీరలకు చెందిన 3 సం. బాబుకు తండ్రి అయిన 35 సంవత్సరాల వ్యక్తి ఇంట్లో మెట్ల మీదనుండి జారి కిందపడి మృతి... AP NRI మంత్రిత్వ శాఖ ఉచిత అంబులెన్సు ద్వారా హైదరాబాదు ఎయిర్ పోర్ట్ నుండి స్వస్తలం చేరిన మృత దేహం

Header Banner

అమెరికా లో చీరలకు చెందిన 3 సం. బాబుకు తండ్రి అయిన 35 సంవత్సరాల వ్యక్తి ఇంట్లో మెట్ల మీదనుండి జారి కిందపడి మృతి... AP NRI మంత్రిత్వ శాఖ ఉచిత అంబులెన్సు ద్వారా హైదరాబాదు ఎయిర్ పోర్ట్ నుండి స్వస్తలం చేరిన మృత దేహం

  Sun Aug 20, 2017 09:48        APNRT, Helping Hand, India, Kuwait, Telugu, World

అమెరికా లో చీరలకు చెందిన 3 సం. బాబుకు తండ్రి అయిన 35 సంవత్సరాల వ్యక్తి ఇంట్లో మెట్ల మీదనుండి జారి కిందపడి మృతి... AP మంత్రిత్వ శాఖ ఉచిత అంబులెన్సు ద్వారా హైదరాబాదు ఎయిర్ పోర్ట్ నుండి స్వస్తలం చేరిన మృత దేహం  

చీరలకు చెందిన కార్యంపూడి దినకర్ గత 4 సంవత్సరాలుగా అమెరికా లోని న్యూ జెర్సీ దగ్గర పర్సిప్పనీ లో సాఫ్ట్ వేర్ లో పని చేస్తున్నాడు. ఈ మద్యనే అతని ఫ్యామిలీ ని కూడా తీసుకోని వెళ్ళాడు అమెరికాకు. పేద కుటుంబం లో పుట్టిన దినకర్ తన స్వశక్తి తో చదువుకొని అమెరిక లో ఉద్యోగం సంపాదించుకొని అక్కడే నివసిస్తున్నాడు.

గత 15 ఆగస్ట్ న అనుకోకుండా ప్రమాద వశాత్తు మెట్ల మిద నుండి జారి క్రింద పడ్డాడు తన నివాసంలో. అలా జారి పడటం తో తలకు గాయమై అపస్మారక స్తితిలో వెళ్ళగా అక్కడ ఆసుపత్రి లో చ్చికిత్స పొందుతూ అదే రోజు చనిపోయాడు. ఇతనికి భార్య మరియు 3 సంవత్సరాల బాబు ఉన్నారు.

అక్కడే ఉన్న తన మిత్రులు TANA సహాకారం తో మృత దేహాన్ని ఇండియాకు పంపడానికి అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసి 18 న ఫ్లైట్ లో పంపటం జరిగింది. ఈ లోపు వారు కువైట్ ఎన్నారైస్ ను అబులెన్స్ కొరకు సంప్రదించగా, కువైట్ ఎన్నారైస్  AP మంత్రిత్వ శాఖ మన NRI ల కోసం ప్రవేసపెట్టిన ఉచిత అంబులెన్సు కొరకు సంభదిత డాక్సుమేంట్ పనులు చేసి ఆ శాఖకు పంపి అంబులెన్సు ను సమకూర్చడం జరిగింది.  

మృతుడి భంధువులు ఎవరు అందుబాటు లో లేని కారణం గా మృత దేహం తో పాటు ఎవరు కూడా వెళ్ళలేక పోయారు. అయినా కాని 19 రాత్రి చేరిన మృత దేహాన్ని  AP ప్రభుత్వం ప్రతినిధులు ఎయిర్ పోర్ట్ కార్గో లో దేహాన్నితీసుకు వెళ్ళటానికి వచ్చిన వారి భందువుల సహకారం తో త్వరితగతిన క్లియరెన్స్ చేసి దేహాన్ని అప్పగించారు.  ఈ విషయం లో ఎప్పటికప్పుడు మృతుడి భందువుల తో కువైట్ ఎన్నారైస్  సంప్రదిస్తూ అంబులెన్సు ఎయిర్పోర్ట్ నుండి బైలుదేరే వరకు తగిన శుచనలు చేసి ఏ ఇబ్బది కలుగ కుండా చూసుకోవడం జరిగింది.  

గమనిక: విదేశాల్లో ఆంధ్రప్రదేశ్ కు సంభందించిన వారు ఏదైనా అనివార్య కారణాలతో చనిపోతే వారి మృత దేహాన్ని చెన్నై లేదా హైదరాబాదు ఎయిర్ పోర్ట్ ల నుండి వారి స్వగ్రామాలకు ఉచితం గా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తమ ప్రభుత్వ  ఖర్చులతో అంబులెన్సు సర్వీస్ ను అందిస్తుంది. ఈ అవకాశాన్ని సంభదిత వ్యక్తులు సద్వినియోగం చేసుకోవలసింది గా కువైట్ ఎన్నారైస్ విజ్ఞప్తి చేస్తుంది. ఈ సందర్భం గా ఈ అంబులెన్సు సర్విస్ కావాలని అనుకునే వారు (ప్రపంచంలో ఏ దేశం లో ఉన్నఆంధ్ర ప్రదేశ్ NRIS) కువైట్ ఎన్నారై ను సంప్రదిస్తే ప్రభుత్వ అధికారులతో సంప్రదించి అంబులెన్సు సర్వీసు ను అరేంజ్ చేస్తుంది.

ఈ విషయం ప్రతి ఒక్కరికి చేరే విధం గా షేర్ చేయండి, వారికి ఈ విషయం తెలియ చేయండి.

కువైట్ ఎన్నారైస్ కు email: kuwaitnris@kuwaitnris.com లేదా whats app +96590001504 కు లేదా +965 60905470 కు సంప్రదించండి. ఏ దేశం నుండి అయినా పర్వాలేదు. (2 రోజుల ముందు గా సంప్రదించిన, ఏ ఆటంకాలు లేకుండా అంబులెన్సు అరేంజ్ చేయబడుతుంది. గమనించ గలరు)


   అమెరికా లో చీరలకు చెందిన 3 సం. బాబుకు తండ్రి అయిన 35 సంవత్సరాల వ్యక్తి ఇంట్లో మెట్ల మీదనుండి జారి కిందపడి మృతి... AP మంత్రిత్వ శాఖ ఉచిత అంబులెన్సు ద్వారా హైదరాబాదు ఎయిర్ పోర్ట్ నుండి స్వస్తలం చేరిన మృత దేహం