శిల్పా బండారాన్ని బయటపెట్టిన చంద్రబాబు

Header Banner

శిల్పా బండారాన్ని బయటపెట్టిన చంద్రబాబు

  Sat Aug 19, 2017 21:52        India, Telugu

 వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డిపై సీఎం విరుచుకుపడ్డారు. ‘‘శిల్పా పది సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్నారు. మంత్రిగా కూడా పనిచేశారు. గృహనిర్మాణశాఖా మంత్రిగా ఉండి ఎవరికైతే ఇళ్లు కట్టివ్వాలో.. వాళ్లకు కట్టకుండా ఆ భూమిని గొప్పవాళ్లకు ఇచ్చి అందులో లంచాలు తీసుకున్నారు. నేను ప్రభుత్వ భూమిని మీకిచ్చాను. పేదవాడికి ఆస్తి ఇవ్వాలని, మీకు భద్రత ఇవ్వాలని మీరూ, మీ కుంటుంబం సంతోషంగా ఉండాలని 13 వేల ఇళ్లను కట్టిస్తున్నాను’’ అని చంద్రబాబు నంద్యాల రోడ్‌ షోలో ప్రజలకు హామీ ఇచ్చారు. పేదవాళ్లకు రక్షణగా ఉండాల్సిన వ్యక్తి.. వాళ్ల భూములు కొట్టేశారని శిల్పాపై చంద్రబాబు ఆరోపణలు గుప్పించారు. మార్కెట్ కమిటీకి చెందవలసిన భూమిలో శిల్పా మోహన్‌రెడ్డి షాపులు కట్టుకున్నారని ఆరోపించారు. ఇదేక్కడ న్యాయం తమ్ముళ్లూ అంటూ చంద్రబాబు సభికులను ఉద్దేశించి శిల్పా మోహన్‌రెడ్డి బండారాన్ని బయటపెట్టారు.

భూమా బ్రహ్మానందరెడ్డి ఆళ్లగడ్డ వాసి అంటున్న.. శిల్పా బ్రదర్స్ కడప జిల్లా వాసులని ఆయన వెల్లడించారు. శిల్పా సహకార్‌ను చట్ట విరుద్ధంగా నిర్మించారని, రోడ్ల విస్తరణ బాధితులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. గండికోట పూర్తయితే పులివెందుల సస్యశ్యామలం అవుతుందని చంద్రబాబు చెప్పారు.   శిల్పా బండారాన్ని బయటపెట్టిన చంద్రబాబు