మినిమమ్ బ్యాలెన్స్ లేదని రూ.235 కోట్లు వసూలు చేసిన ఎస్‌బీఐ!

Header Banner

మినిమమ్ బ్యాలెన్స్ లేదని రూ.235 కోట్లు వసూలు చేసిన ఎస్‌బీఐ!

  Sat Aug 19, 2017 21:16        India, Telugu

ఖాతాదారులు తప్పకుండా తమ బ్యాంకు అకౌంట్లలో మినిమమ్ బ్యాలెన్స్‌ను ఉంచుకోవాలని ఇటీవల భారతీయ స్టేట్ బ్యాంకు నిబంధన విధించింది. లేకుంటే జరిమానా తప్పదని హెచ్చరించింది. బ్యాంకు ఆదేశాలను లైట్‌గా తీసుకున్న వారి నుంచి ఎస్బీఐ ఏకంగా రూ.235.06 కోట్లను జరిమానా రూపంలో వసూలు చేసింది. తొలి త్రైమాసికంలో మొత్తం 388.74 లక్షల ఖాతాల నుంచి ఈ మొత్తాన్ని వసూలు చేసినట్టు తెలిపింది. ఆర్టీఐ చట్టం ద్వారా ఓ వ్యక్తి దాఖలు చేసిన దరఖాస్తుకు స్పందించిన ఎస్‌బీఐ ఈమేరకు సమాధానం ఇచ్చింది. జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో మినిమమ్ బ్యాలెన్స్‌ నిర్వహణలో విఫలమైన ఖాతాల నుంచి ఈ మొత్తాన్ని వసూలు చేసినట్టు వివరించింది.   మినిమమ్ బ్యాలెన్స్ లేదని రూ.235 కోట్లు వసూలు చేసిన ఎస్‌బీఐ!