రైలు ప్రమాదంపై మోదీ విచారం

Header Banner

రైలు ప్రమాదంపై మోదీ విచారం

  Sat Aug 19, 2017 21:07        India, Telugu

పూరీ నుంచి హరిద్వార్ వెళ్తున్న కళింగ ఉత్కల్ రైలు ముజఫర్‌నగర్ వద్ద ఘోర ప్రమాదానికి గురి కావడంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన అని అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కేంద్ర రైల్వే శాఖ, ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం బాధితులకు పూర్తి సహాయ సహకారులు అందిస్తాయని మోదీ భరోసా ఇచ్చారు. కాగా, రైలు ప్రమాద ఘటనపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సైతం ట్విట్టర్‌లో స్పందించారు. ఇది చాలా దురదృష్టకర ఘటనని అన్నారు. మృతుల కుటుంబాలు తన సానుభూతి తెలియజేశారు.   రైలు ప్రమాదంపై మోదీ విచారం