సమగ్ర భూసర్వేపై సీఎం కేసీఆర్‌ సమీక్ష.. గ్రామం యూనిట్‌గా సర్వే: కేసీఆర్

Header Banner

సమగ్ర భూసర్వేపై సీఎం కేసీఆర్‌ సమీక్ష.. గ్రామం యూనిట్‌గా సర్వే: కేసీఆర్

  Fri Aug 18, 2017 22:09        India, Telugu

సమగ్ర భూసర్వేపై సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. 1932-36 మధ్య నిజాం హయాంలో భూ సర్వే జరిగిందని.. తర్వాత ఎప్పుడూ భూ సర్వే జరగలేదని సీఎం కేసీఆర్‌ వెల్లడించారు. భూ వివరాలు సరిగ్గా లేకపోవడం వల్ల అనేక అనర్థాలు, వివాదాలు జరుగుతున్నాయని కేసీఆర్ స్పష్టం చేశారు. రైతులకు పెట్టుబడి పథకం సరిగ్గా అమలు కావాలంటే ఏ భూమి ఎవరి ఆధీనంలో ఉందో తెలియాలని సీఎం కేసీఆర్‌ అన్నారు. రాష్ట్రంలోని 10,875 రెవెన్యూ గ్రామాల పరిధిలో గ్రామం యూనిట్‌గా సర్వే చేయాలన్నారు. రైతుల సహకారంతో అధికారులు భూ రికార్డులను అప్ డేట్ చేస్తారని కేసీఆర్ తెలిపారు. భూ వివరాలను ఆన్‌లైన్‌లో పెడతామని సీఎం కేసీఆర్‌ చెప్పారు.   సమగ్ర భూసర్వేపై సీఎం కేసీఆర్‌ సమీక్ష.. గ్రామం యూనిట్‌గా సర్వే: కేసీఆర్