రెస్టారెంట్ ఫ్రీజర్‌లో దాక్కొని...ప్రాణాలు దక్కించుకున్న నటి

Header Banner

రెస్టారెంట్ ఫ్రీజర్‌లో దాక్కొని...ప్రాణాలు దక్కించుకున్న నటి

  Fri Aug 18, 2017 21:53        Cinemas, India, Telugu

మృత్యువు తరుముకొచ్చినప్పుడు తలదాచుకునేందుకు అందుబాటులో ఏది కనిపిస్తే అందులో దాక్కొని ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేస్తాం. బార్సిలోనా టెర్రర్ దాడి సమయంలో యూకేలోని భారత సంతతికి చెందిన పాపులర్ టీవీ నటి లైలా రౌస్  సైతం అదే చేసింది. ఓ రెస్టారెంట్‌లోని ఫ్రీజర్‌లో తలదాచుకుంది. అదృష్టవశాత్తూ ప్రాణాప్రాయం నుంచి తప్పించుకుంది. ఓ ట్వీట్‌లో ఆవిషయాన్ని లైలా రౌస్ తెలియజేసింది. సిటీలో హాలీడేస్ ఎంజాయ్ చేసేందుకు తన పదేళ్ల కుమార్తె ఇనెజ్ ఖాన్‌తో కలిసి వచ్చిన రౌస్... రద్దీగా ఉండే లాస్ రాంబ్లాస్ ఏరియాలో తిరుగుతుండగా ఒక మృత్యుశకటం (వ్యాన్ః పాదచారులపై దూసుకువచ్చింది. దీంతో 14 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, సుమారు 100 మంది గాయపడ్డారు. 'దాడి జరగ్గానే భయంతో పరుగులు తీశాను. రెస్టారెంట్ ఫ్రీజర్‌లో దాక్కున్నాను. ఇదంతా క్షణాల్లో జరిగిపోయింది. ఫ్రీజర్‌లో ఉండి ఏ ఒక్కరికీ ప్రాణ హాని జరక్కూడదని ఆ భగవంతుని ప్రార్ధించాను' అని రౌస్ ఓ ట్వీట్‌లో తెలిపింది. మొరాకో తండ్రికి, ఇండియన్ తల్లికి పుట్టిన 44 ఏళ్ల రౌస్....బ్రిటిష్ టెలివిజన్‌లో పాపులర్ స్టార్‌గా పేరు తెచ్చుకుంది. 'ఫుట్ బాలర్స్', 'వైవ్స్', వంటి టీవీ షోలలో కనిపించింది. బ్రిటిష్ స్నూకర్‌ ఆటగాడు రోనీని పెళ్లాడిన రౌస్ 1990 దశకంలో ఇండియాలో 'ఛానెల్ V'లో వీజేగా కెరీర్ ప్రారంభించింది.   రెస్టారెంట్ ఫ్రీజర్‌లో దాక్కొని...ప్రాణాలు దక్కించుకున్న నటి