ఓమాన్ లోని మస్కట్ కు పనికోసం వెళ్లి 14 ఏళ్ళు గా రాని పాలమాకుల సత్తయ్య చివరకు శవమై స్వగ్రామానికి చేరిక. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ ఏర్ పోర్ట్ నుండి స్వగ్రామం వరకు ఉచిత అంబులెన్సు

Header Banner

ఓమాన్ లోని మస్కట్ కు పనికోసం వెళ్లి 14 ఏళ్ళు గా రాని పాలమాకుల సత్తయ్య చివరకు శవమై స్వగ్రామానికి చేరిక. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ ఏర్ పోర్ట్ నుండి స్వగ్రామం వరకు ఉచిత అంబులెన్సు

  Fri Aug 18, 2017 18:12        Associations, Gulf News, Telugu

ఓమాన్ లోని మస్కట్ కు పనికోసం వెళ్లి 14 ఏళ్ళు గా రాని పాలమాకుల సత్తయ్య చివరకు శవమై స్వగ్రామానికి  చేరిక.  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ ఏర్ పోర్ట్ నుండి స్వగ్రామం వరకు ఉచిత అంబులెన్సు

ఓమాన్ లోని మస్కట్ లో మృతిచెందిన పాలమాకుల సత్తయ్య మృతదేహం గురువారం హైదరాబాద్ కు చేరుకున్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ ఏర్ పోర్ట్ నుండి మృతుడి స్వగ్రామం కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మిపూర్ వరకు ఉచిత అంబులెన్సు సౌకర్యం కల్పించారు.

రజక వృత్తి చేసుకునే పాలమాకుల సత్తయ్య ఉన్న ఊళ్ళో ఉపాధి కరువై, పొట్టచేతపట్టుకుని భార్య, ముగ్గురు పిల్లల్ని వదిలి తన స్వగ్రామం కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మిపూర్ నుండి 14 ఏళ్ల క్రితం 2003 లో ఓమాన్ దేశంలోని మస్కట్ కు వలసవెళ్లాడు. సత్తయ్య కోసం గత 14 ఏళ్లుగా భార్య కనకమ్మ, కూతుళ్లు స్వప్న, శైలజ, కుమారుడు రమేష్ ఎదిరిచూస్తునే ఉన్నారు. 2008 లోనే పాస్ పోర్ట్, ఐడి కార్డుల గడువు మీరిపోయినందున 'ఖల్లివెళ్లి' (అక్రమ నివాసి) గా మారిన  సత్తయ్య క్షమాభిక్ష అవకాశమున్నా స్వగ్రామానికి రాలేదు.

అనారోగ్యంతో మస్కట్ లోని ఒక ఆసుపత్రిలో చేరిన సత్తయ్య 31 జులై 2017 మృతిచెందాడు. అక్రమ నివాసి అయిన సత్తయ్య మృతదేహాన్ని ఇండియాకు పంపడానికి ఉన్న సాంకేతిక సమస్యలను అధిగమించి ఇండియన్ ఎంబసీ సహాయంతో శవపేటికను ఇంటికి పంపడానికి మస్కట్ లోని తెలంగాణ సామాజిక సేవకులు పోల్సాని లింగయ్య కృషిచేశారు.

సత్తయ్య మృతదేహాన్ని ఇండియాకు తెప్పించడానికి కావలసిన పత్రాలను సమకూర్చడంలో తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షులు నంగి దేవేందర్ రెడ్డి  సహకరించారు. మేరకు ఆయన విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, తెలంగాణ ఎన్నారై మంత్రి కేటీఆర్, మస్కట్ లోని ఇండియన్ ఎంబసీకి -మెయిల్ ద్వారా విజ్ఞప్తి చేశారు.

"గల్ఫ్ మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలి"

గత మూడేళ్ళలో గల్ఫ్ దేశాల నుండి తెలంగాణ వలసకార్మికులకు చెందిన 600 కుపైగా మృతదేహాలు కలిగిన శవపేటికలు హైదరాబాద్ ఏర్ పోర్ట్ కు చేరుకున్నట్లు  శంషాబాద్ పోలీస్ స్టేషన్ లోని డెత్ రిజిస్టర్ ప్రకారం తెలుస్తున్నదని దేవేందర్ రెడ్డి అన్నారు. గల్ఫ్ దేశాలలో చనిపోయిన కార్మికుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గల్ఫ్ దేశాలలో ఇబ్బందుల్లో ఉన్నవారు సహాయంకోసం, సలహాల కోసం తమ హెల్ప్ లైన్ నెంబర్ +91 81435 88886  సంప్రదించవచ్చని ఆయన తెలిపారు.

అదే విధం గా ఆంధ్ర ప్రదేశ్ కు లేదా తెలంగాణకు  చెందినవారు ఎవరైనా కూడా, ఏవిధమైన సహాయం లేదా సలహాలు కావాలన్న  కువైట్ ఎన్నారైస్ ను కూడా సంప్రదించవచ్చు.

మా ఈమెయిలు: kuwaitnris@kuwaitnris.com 

whats అప్: +96590001504

   ఓమాన్ లోని మస్కట్ కు పనికోసం వెళ్లి 14 ఏళ్ళు గా రాని పాలమాకుల సత్తయ్య చివరకు శవమై స్వగ్రామానికి చేరిక. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ ఏర్ పోర్ట్ నుండి స్వగ్రామం వరకు ఉచిత అంబులెన్సు