వర్షం పడి తడిసి ముద్దయినా ఒక్క అభిమాని కూడా కదల్లేదు..

Header Banner

వర్షం పడి తడిసి ముద్దయినా ఒక్క అభిమాని కూడా కదల్లేదు..

  Thu Aug 17, 2017 21:56        Cinemas, India, Telugu

బాలయ్య హీరోగా నటించిన పైసా వసూల్ చిత్రం ఖమ్మంలో ఆడియో రిలీజ్ ఫంక్షన్‌ జరుగుతుండగా భారీ వర్షం కురిసింది. దీంతో కార్యక్రమం ముందుకు సాగకపోవచ్చని ఒక దశలో అనిపించింది. అయితే ఆశ్చర్యకరంగా కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలివచ్చిన అభిమానుల్లో ఒక్కరూ వెనక్కు పోలేదు. ఫ్యాన్స్ అంతా తడుస్తూ కూడా గ్రౌండ్‌లోనే ఉండి బాలయ్యపై అభిమానం చాటుకున్నారు. ఆడియో ఫంక్షన్ కార్యక్రమం విజయవంతం అవడంపై చిత్ర యూనిట్ హర్షం వ్యక్తం చేసింది. ఆడియో ఫంక్షన్‌కి హైదరాబాద్ నుంచి హీరో బాలకృష్ణ, పూరీ జగన్నాథ్, క్రిష్, బోయపాటి, హీరోయిన్లు ఛార్మి, శ్రియా, కైరా దత్, ముస్కాన్ తదితరులు పాల్గొన్నారు. భారీ వర్షం పడినా అభిమానులెవ్వరూ కదలకుండా కార్యక్రమం పూర్తయ్యేదాకా ఉండటంతో బాలయ్య తన్మయులయ్యారు. అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో మాట్లాడిన ప్రతి ఒక్కరు కూడా ఫ్యాన్స్ అభిమానాన్ని ప్రత్యేకంగా ప్రశంసించారు. 



   వర్షం పడి తడిసి ముద్దయినా ఒక్క అభిమాని కూడా కదల్లేదు..