కువైట్ లో కష్టాలు పడుతున్న వారికీ ఆర్ధిక సహాయం కోసం వెంకట్ కోడూరి ఆద్వర్యం లో, మరియు కువైట్ ఎన్నారైస్ సహకారం తో ఒక ప్రత్యెక నిధి... వెంకట్ కోడూరి 48 వ జన్మదిన సందర్భం గా 480 దీనార్ల విరాళం..

Header Banner

కువైట్ లో కష్టాలు పడుతున్న వారికీ ఆర్ధిక సహాయం కోసం వెంకట్ కోడూరి ఆద్వర్యం లో, మరియు కువైట్ ఎన్నారైస్ సహకారం తో ఒక ప్రత్యెక నిధి... వెంకట్ కోడూరి 48 వ జన్మదిన సందర్భం గా 480 దీనార్ల విరాళం..

  Wed Aug 16, 2017 16:41        APNRT, Associations, Helping Hand, Kuwait, Telugu

కువైట్ లో కష్టాలు పడుతున్న వారికీ ఆర్ధిక సహాయం కోసం వెంకట్ కోడూరి ఆద్వర్యం లో, మరియు కువైట్ ఎన్నారైస్ సహకారం తో ఒక ప్రత్యెక నిధి... వెంకట్ కోడూరి 48 వ జన్మదిన సందర్భం గా 480 దీనార్ల విరాళం..

కువైట్ లో ఎంతో మంది ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్న విషయం అందరికి తెలిసిందే. కొందరు అకస్మాత్తు గా చనిపోవటం, ఆ చనిపోయిన వారి దేహాలను తరలించాలంటే ఆర్ధికంగా ఇబ్బందులు, లేదా కొంతమంది జబ్బున పడి ఆర్ధికంగా చితికి పోయిన వారు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాల ఉహించలేని ఎన్నో రకాల కష్టాలు. ఇలాంటివి చాలా మా దృష్టికి (కువైట్ ఎన్నారైస్ ) వచ్చినవి ఎన్నో మేము ప్రచురిస్తున్నాము, అవి మీరు చూస్తున్నారు.

వీటన్నిటిని దృష్టి లో ఉంచుకొని ఇలా కష్టాల్లో ఉన్న వారికీ ఎంతో కొంత ఆర్ధిక సహాయం చేయాలి అనే ఆలోచనతో ప్రవాసాంధ్ర తెలుగు దేశం వర్కింగ్ ప్రెసిడెంట్, APNRT కువైట్ కో ఆర్డినేటర్ శ్రీ వెంకట్ శివ కోడూరు గారు మరియు కువైట్ ఎన్నారైస్ ఆలోచన చేసి ఒక నిధి ఏర్పాటు చేయాలనీ సంకల్పించారు. ఈ నిధి కోసం కువైట్ లో ఉన్న వారందరి వద్దకు వెళ్లి సహాయం కోసం అభ్యర్ధించడం జరుగుతుంది.

ఈ రోజు వెంకట్ కోడూరు గారు తన 48 వ జన్మ దినోత్సవం జరుపుకుంటున్నారు. ఈ సందర్భం గా ఈ నిది కోసం 48 వ జన్మ దినోత్సవం కాబట్టి 480 దీనార్లు మొట్ట మొదటిగా దాతగా తనవంతు విరాళాన్ని ప్రకటించారు. వారికీ వారి కుటుంబ సభ్యలకు అందరికి  కుడా అయురారోగ్యలను అష్ట ఐశ్వర్యాలను ప్రసాదించాలని ఆ దేవుడికి ప్రార్ధన. అలాగే వారికీ జన్మదిన శుభాకాంషలు.

ఈ నిధి కొరకు ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి తమ వంతూ సహాయం చేయవలసింది గా ప్రార్ధన.

ఈ నిధికి ఇచ్చే ప్రతి ఫిల్స్ కుడా కువైట్ ఎన్నారైస్ వెబ్ సైట్ లో అప్పటికి అప్పుడు అప్డేట్ అవుతుంది. అదే విధం గా ఎవరెవరికి ఏవిధమైన సహాయం చేయబడింది అనేది కుడా ఒక ప్రత్యకమైన పేజి క్రియేట్ చేసి అందులో ఉంచడం జరుగుతుంది, ఇదంతా పారదర్శకంగా ఉండటం కొరకు ఒక ప్రత్యేకమైన సాఫ్ట్ వేర్ సిధం చేయడం జరిగింది.

అదే విధం గా అడిగిన వారికీ అందరికి కాకుండా ప్రతి కేసు ను క్షున్నం గా పరిశీలించి సహాయం చేయడం జరుగుతుంది. ఇందు కొరకు కొన్ని ప్రత్యెక నియమ నిబంధనలు కుడా తయారు చేసుకోవడం జరుగుతుంది.

ఈ సందర్బం గా కువైట్ లో ఉన్న ప్రతి ఒక్కరు మరియు ప్రతి సేవా సంస్త కుడా ముందుకు వచ్చి ఈ నిధి కి చేయూతనిచ్చి కువైట్ లో కష్టాల్లో ఉన్న మన తెలుగు వారికి అర్దికం గా సహాయం చేయడానికి ఈ మహా యజ్ఞం లో పాలు పంచుకోవలసిందిగా మీ కువైట్ ఎన్నారైస్ ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తుంది..

మరిన్ని వివరాలకు కువైట్ ఎన్నారైను సంప్రదించ వచ్చు.

ఈమెయిలు: kuwaitnris@kuwaitnris.com

   కువైట్ లో కష్టాలు పడుతున్న వారికీ ఆర్ధిక సహాయం కోసం వెంకట్ కోడూరి ఆద్వర్యం లో, మరియు కువైట్ ఎన్నారైస్ సహకారం తో ఒక ప్రత్యెక నిధి... వెంకట్ కోడూరి 48 వ జన్మదిన సందర్భం గా 480 దీనార్ల విరాళం..