కువైట్ లో అందరికి చిర పరిచయస్తుడు, నిరాబండరుడు, ఎందరికో అపత్భాంధవుడు తెలుగు కళా సమితి శ్రేయోభిలాషి, ఉప్పార సాయిబాబా గారు గుండెపోటు తో మరణం...

Header Banner

కువైట్ లో అందరికి చిర పరిచయస్తుడు, నిరాబండరుడు, ఎందరికో అపత్భాంధవుడు తెలుగు కళా సమితి శ్రేయోభిలాషి, ఉప్పార సాయిబాబా గారు గుండెపోటు తో మరణం...

  Sat Aug 12, 2017 15:37        Associations, Telugu, Kuwait

కువైట్ లో అందరికి చిర పరిచయస్తుడు, నిరాబండరుడు, ఏదరికో అపత్భాంధవుడు తెలుగు కళా సమితి శ్రేయోభిలాషి, ఉప్పార సాయిబాబా గారు గుండెపోటు తో మరణం...

కువైట్ ఆయిల్ కంపెనీ లో 20 సంవత్సరాలు పైగా పనిచేసి ఇటివలే స్వచ్చంద గా రిటైర్ అయి, ఇండియాలో సెటిల్ అయిన శ్రీ సాయి బాబా గారు ఈ రోజు గుండె పోటు తో ఇండియా లో మరణించారు.

వీరు సాంఘికం గా, మరియు సామాజికం గా ఎన్నో సేవలు కువైట్ లో చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. కువైట్ లోని తెలుగు కళా సమితి కి ఎన్నో సంవత్సరాల నుండి ఎన లేని సేవలు చేసారు. ముఖ్యం గా ఏదైనా ప్రోగ్రాం చేయాలంటే ఎంతో ఆర్ధిక పరమైన సమస్యలు ఉంటాయి. అయితే వీరు తనతో పాటు తనకు తెలిసిన ఎన్నో కంపెనీ ల నుండి మాట్లాడి ఆర్ధిక సహాయం అందిస్తూ వుండే వారు. వీరి సహాయం లేకుండా గత కొన్ని సంవత్సరాలు గా ఏ ప్రోగ్రాం జరుగ లేదు అంటే ఒక అతిశయోక్తి కాదు.

అలాగే ఎంతో మంది తెలుగు వారు క్రింది స్తాయి నుండి ఇంజనీర్ ల స్తాయి వరకు ఎంతో మందికి (వందల్లో) తమకు తెలిసిన లేదా తన వద్ద సబ్ కాంట్రాక్టర్స్ వద్ద ఉద్యోగాలు ఇప్పించిన ఘనత వీరిది.

వీరిది స్వగ్రామం ఎమ్మిగ నూరు కర్నూల్ జిల్లా. వీరికి భార్య కూతురు, కొడుకు ఉన్నారు. వారు ఇంకా చదువుల్లోనే ఉన్నారు.

వీరి మరణానికి కువైట్ లో ని తెలుగు కళా సమితి కార్యవర్గం మరియు సభ్యులు, ఆప్త మిత్రులు, శ్రేయోభిలాషులు తీవ్ర దిభ్రాంతికి గురయ్యారు. వీరి అకాల మృతికి వీరందరు తమ ప్రఘాడ సానుభుతిని వారి కుటుంబ సభ్యలకు తెలిపారు.

ఈ సందర్భం గా కువైట్ ఎన్నారైస్ వీరి కుటుంబ సభ్యలకు ప్రఘాడ సానుభూతిని తెలియ చేస్తూ సాయి బాబా గారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రాదిస్తూ శ్రద్ధాంజలి ఘటిస్తుంది.       



   కువైట్ లో అందరికి చిర పరిచయస్తుడు, నిరాబండరుడు, ఏదరికో అపత్భాంధవుడు తెలుగు కళా సమితి శ్రేయోభిలాషి, ఉప్పార సాయిబాబా గారు గుండెపోటు తో మరణం...