కువైట్ లో ఉద్యోగం కోసం: అన్ని అర్హతలు ఉన్నాయి... కానీ ఉద్యోగానికి తీసుకోలేదు ఎందుకో తెలుసుకోండి కువైట్ లేబర్ లా చాప్టర్-సెక్షన్-ఆర్టికల్ 2-2-12

Header Banner

కువైట్ లో ఉద్యోగం కోసం: అన్ని అర్హతలు ఉన్నాయి... కానీ ఉద్యోగానికి తీసుకోలేదు ఎందుకో తెలుసుకోండి కువైట్ లేబర్ లా చాప్టర్-సెక్షన్-ఆర్టికల్ 2-2-12

  Sat Aug 12, 2017 13:31        కువైట్ శ్రామిక చట్టం (Kuwait Labor Law), Kuwait, Telugu

చంద్రం చదువులో చక్కటి ప్రతిభావంతమైన కుఱ్ఱాడు. పరీక్షలన్నింటిలోను మొదటి ర్యాంకులోనే ఉండేవాడు. అదే నమ్మకంతో సి ఏ.. అంటే చార్టెడ్ ఎకౌంట్స్ చేద్దామని కోచింగ్ తీసుకుని మరీ సి.ఏ చదవడానికి గాను నిర్వహించే ప్రత్యేక పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. చదువుల సరస్వతి అతని చెంత ఉండగా ఇంక అతనికి బెరుకేముంది. చక్కటి పర్సెంటేజ్ తో ఉత్తీర్ణుడై మంచి కాలేజ్ లో జాయిన్ అయ్యాడు. సి.ఏ ఫైనల్ రాయడానికి ముందు ఒక ప్రముఖ ఛార్టెడ్ ఎకౌంటెంట్ దగ్గర శిష్యరికం (Apprentice ship) చెయ్యాలి కాని, అదేమంత ముఖ్యం కాదులే తనకి అన్నీ తెలుసు కదా అని వృత్తి విధ్య శిష్యరికం (Apprentice ship) పట్ల మక్కువ చూపలేదు.

చదువు అయిన తరువాత తన బాబాయ్ కువైట్లో మంచి ఉద్యోగం ఇప్పిస్తాను రమ్మంటే పట్టలేని ఆనందంతో కువైట్ చేరుకున్నాడు. అక్కడ పెరెన్నికగన్న సంస్థలో ఇంటర్వ్యూ సమయంలో తాను చదివిన, ఉత్తీర్ణుడయిన అన్ని సర్టిఫికెట్లను చూపించాడు. వారు అప్రెంటిస్ షిప్ సర్టిఫికేట్ అడిగితే తెల్లమొహం వేశాడు. అందుకనే ఎంత పెద్ద చదువులు చదివినా కొన్ని న్యాయపరమయిన పద్ధతులని పాటిస్తే మన జీవితాలకి బంగారు బాట వేసినవాళ్ళమవుతామనే  విషయంలో ఈ చంద్రం జీవితం పెద్ద ఉదాహరణ.

“కువైట్ లేబర్ లా చాప్టర్ 2, సెక్షన్ 2, శిష్యరికం, వృత్తి విధ్య శిక్షణ ఆర్టికల్ 12”

ఏ విధమైన వృత్తి విద్యా కోర్సులకయినా సరే ఆ వృత్తి కి సంబంధించి, ఆయా ప్రభుత్వాల చట్టాలని అనుసరించి, తప్పనిసరిగా సంబంధిత గురువుల సంస్థల వద్ద శిష్యరికం చేయాలి. అది కూడా చట్టపరంగా, ప్రభుత్వం నిర్ధేసించినంత కాలం వారు ఆ అప్రెంటిస్ షిప్ చేయాల్సిందిగా ఈ ఆర్టికల్ చెప్తోంది. సంబంధిత రంగాల ఉద్యోగాల్లో నియమించబడాలంటే నిర్దేశించినంత కాలం తప్పనిసరిగా అప్రెంటిస్ షిప్ చేయాలన్నదే ఈ ఆర్టికల్ ప్రముఖోద్దేశ్యం.


   కువైట్ లో ఉద్యోగం కోసం: అన్ని అర్హతలు ఉన్నాయి... కానీ ఉద్యోగానికి తీసుకోలేదు ఎందుకో తెలుసుకోండి కువైట్ లేబర్ లా చాప్టర్-సెక్షన్-ఆర్టికల్ 2-2-12