దగ్గుబాటి థియేటర్‌లో భారీ అగ్నిప్రమాదం

Header Banner

దగ్గుబాటి థియేటర్‌లో భారీ అగ్నిప్రమాదం

  Thu Aug 10, 2017 21:18        India, Telugu

 ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా చీరాల లో సురేష్ మహల్ థియేటర్ అగ్నిప్రమాదానికి గురైంది. దగ్గుబాటి రామానాయుడుకు కుటుంబానికి చెందిన ఈ థియేటర్‌ను గత కొద్దిరోజులుగా మరమ్మత్తులు చేస్తున్నారు. ఈరోజుతో మరమ్మత్తులు పూర్తిచేసుకొని రేపు దగ్గుబాటి రానా చేతులమీదుగా ప్రారంభం కాబోతున్న ఈ థియేటర్ ఒక్కసారిగా మంటల్లో చిక్కుకోవడం స్థానికంగా కలకలం రేపింది.
 
థియేటర్‌లో ఆధునిక టెక్నాలజీ ని పొందుపరిచి.. ఏసి పనులు జరుగుతున్న ఫిట్టింగ్ క్రమంలో అనుకోకుండా మంటలు అంటుకొని థియేటర్ అంతా వ్యాపించి పెద్దఎత్తున పొగలు వచ్చాయి. దీంతో స్థానిక ప్రజలు ఫైర్ వారికి సమాచారం అందించడంతో ఫైర్ వాళ్ళు మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఉదంతంతో లక్షల్లో ఆస్తినష్టం జరిగినట్లు సమాచారం.


   దగ్గుబాటి థియేటర్‌లో భారీ అగ్నిప్రమాదం