బ్రతుకుదేరువుకోసం కువైట్ వెళ్లి ఆర్ధిక ఇబ్బందులతో చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొన్న వేంకటగిరి వాసి... వై యస్ ఆర్ సీపీ కువైట్ సహకారంతో స్వస్ధలం చేరిన మృతదేహాం

Header Banner

బ్రతుకుదేరువుకోసం కువైట్ వెళ్లి ఆర్ధిక ఇబ్బందులతో చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొన్న వేంకటగిరి వాసి... వై యస్ ఆర్ సీపీ కువైట్ సహకారంతో స్వస్ధలం చేరిన మృతదేహాం

  Thu Aug 10, 2017 10:17        Associations, Helping Hand, Kuwait, Telugu

బ్రతుకుదేరువుకోసం కువైట్ వెళ్లి ఆర్ధిక ఇబ్బందులతో చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొన్న వేంకటగిరి వాసి... వై యస్ ఆర్ సీపీ కువైట్ సహకారంతో స్వస్ధలం చేరిన మృతదేహాం

వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ గల్ఫ్ కన్వీనర్ ఇలియాస్ బి. హెచ్. తెలిపిన వివరాల ప్రకారం కందికట్టు అశోక్ కుమార్ (34)  భార్య లక్ష్మి ప్రసన్న ఇద్దరు రెండు సం. క్రితం జివోనాధారం కొరకు కువైట్ వచ్చి మధ్యనే ఇండియా కు సెలవులపై వెళ్లి మళ్ళి కువైట్ కు తిరిగి వచ్చారు. భార్య కువైతి ఇంట్లో పనిచేస్తుంది. అశోక్ బయటపని చేసుకొంటాడు. అతను ఖైతాన్ ప్రాంతములో ఉండేవారు. 06 - 08 - 17 అనుమానస్పద పరిస్తితుల్లో చెట్టుకు ఉరి వేసుకొని మరణించారు. అశోక్ కుమార్ కూతురు కొడుకు ఇద్దరు చెల్లెలు, అమ్మ కుడా అందరుకూడ ఇతని సంపాదన మీదే ఆధారపడి ఉన్నారు. పిల్లలు ఇద్దరు 5 సంవత్సరాల లోపు వారే.             

అతనికి బంధువైన రాము మరియు అశోక్ కుమార్  భార్య మృతదేహాన్ని, స్వగ్రామం అయిన వేంకటగిరి పంపెందుకు వై. యస్. ఆర్. కాంగ్రెస్ పార్టీ కువైట్ కన్వీనర్ ముమ్మడి బాలిరెడ్డి గారి దృష్టికి తీసుకోని రాగా  వెంటనే స్పందించి తమ వై. యస్. ఆర్. సిపి సేవాదళ్ ఇంచార్జ్ గోవింద రాజు ద్వారా భారత ఎంబసి సహకారం తో పేపర్ వర్క్స్ అన్ని పూర్తి చేపించారు. మానవతా  దృక్పధం తో చెన్నై నుండి స్వస్ధలం వరకు ఉచితంగా అంబులెన్స్ ముమ్మడి బాలిరెడ్డి గారు ఏర్పాటు చేశారు

సభా ఆసుపత్రి మార్చురీలో బాలిరెడ్డి,  గోవిందు రాజు, బంధువులు అశోక్ పార్దివ దేహాన్ని సందర్సించి శ్రద్ధాంజలి ఘటించి వారి కుటుంబ సభ్యులకు ప్రఘాడ సానుభూతి తెలిపారు.                  

అశోక్ భార్య ప్రసన్న మరియు బంధువులు ఎంబసీ అధికారులకు, బాలిరెడ్డి, గోవిందు రాజు లు గారికి కృతఙ్ఞతలు తెలిపారు.

   బ్రతుకుదేరువుకోసం కువైట్ వెళ్లి ఆర్ధిక ఇబ్బందులతో చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొన్న వేంకటగిరి వాసి... వై యస్ ఆర్ సీపీ కువైట్ సహకారంతో స్వస్ధలం చేరిన మృతదేహాం