తమిళంలో బ్రహ్మరథం

Header Banner

తమిళంలో బ్రహ్మరథం

  Wed Aug 09, 2017 21:20        Cinemas, India, Telugu

అందాల బొద్దుగుమ్మ హన్సిక ఈ నాటికీ తనదైన బాణీ పలికిస్తూ సాగుతోంది. బుధవారం హన్సిక పుట్టినరోజు. ఈ సందర్భంగా హన్సికకు విషెస్ చెబుదాం.
 
తెలుగునాటనే నాయికగా తొలుత వెలుగులు విరజిమ్మిన హన్సిక ప్రస్తుతం తమిళంలో భళా అనిపిస్తోంది. ఈ మధ్యే హన్సిక నటించిన తెలుగు చిత్రం 'గౌతమ్ నంద' జనం ముందు నిలచింది. 'దేశముదురు'తో తొలిసారి హీరోయిన్‌గా నటించిన హన్సిక వచ్చీ రాగానే కుర్రకారును ఇట్టే తన అందంతో కట్టిపడేసింది.
 
 
తమిళనాట చిన్న ఖుష్బూగా అక్కడి ప్రేక్షకులు హన్సికను వీరాభిమానంతో ఆరాధిస్తున్నారు. హన్సిక సైతం కేవలం సంపాదనపైనే మనసు పారేసుకోకుండా తన ప్రతి పుట్టినరోజుకు కొంతమంది అనాథ పిల్లలను దత్తత తీసుకొని వారి బాగోగులు చూస్తూ చిరుప్రాయంలోనే మానవత్వం చాటుకుంటోంది. అందమైన రూపంతో పాటు అందమైన మనసునూ సొంతం చేసుకున్న హన్సిక మరిన్ని పుట్టినరోజులు జరుపుకుంటూ ఆనందంగా సాగిపోవాలని ఆశిద్దాం.


   తమిళంలో బ్రహ్మరథం