కడప జిల్లా, మల్లెంవారిపల్లె లోని నలుగురు పిల్లల దీన గాధ... కువైట్ లోని “మైత్రి సేవా సమితి” ద్వారా సహాయం

Header Banner

కడప జిల్లా, మల్లెంవారిపల్లె లోని నలుగురు పిల్లల దీన గాధ... కువైట్ లోని “మైత్రి సేవా సమితి” ద్వారా సహాయం

  Tue Aug 08, 2017 09:30        Associations, Helping Hand, Kuwait, Telugu

కడప జిల్లా, మల్లెంవారిపల్లె లోని నలుగురు పిల్లల దీన గాధ... కువైట్ లోని “మైత్రి సేవా సమితి” ద్వారా సహాయం

సకల సదుపాయాలతో ప్రొద్దున లేస్తే టిఫెన్ నుంచి రాత్రి పడుకునేటప్పుడు హార్లిక్స్ వరకూ ఖరీదైన బంగ్లాలల్లో యాపిల్ ఐపాడ్ లతో చూసుకుంటున్నా కూడా వారికింకా ఏదో కొదవ లాగా ఫీల్ అవుతున్న నేటి పిల్లలు ఉన్న ఈ పరిస్తితుల్లో మల్లెంవారిపల్లె  లోని ఈ నలుగురు పిల్లలు పడుతున్న కష్టాలు చుస్తే మనస్సు కరగ మానదు.....

మల్లెంవారిపల్లె  లోని ఈ నలుగురు పిల్లలు కచ్చితంగా ఒక గంట వర్షం పడితే ఎక్కడ వర్షం నీరు ఇంటిలోపలకు వస్తాయో అంటూ బయంతో, గట్టి గాలి వీస్తే ఊడి పడిపోయేలా వున్న మట్టి గోడలలో ప్రాణాలను ఫణంగా పెట్టి ఒక నులక మంచం, నాలుగు మట్టి కుండలు, ఒక పాతబడిన చాపతో బిక్కు బిక్కుమంటూ నిండుగా కప్పుకోడానికి కూడా సరైన బట్టలు లేని తాతతో ఒక ప్రక్క.... కల్మషం ఎరుగని పసిపిల్లలు మొఖమున చిరునవ్వుతో మరునిమిషం గురించి ఆలోచన వదిలి చేతిలో ఉన్న ఈ నిముషాన్ని ఆస్వాదిస్తుంన్న ఈ పిల్లలకు భగవంతుడికి మా బాదను ఎలా చెప్పాలి చెప్పినా వింటాడా? అనే బాదతో వున్న కడప జిల్లా, పుల్లంపేట మండలం, మల్లెంవారిపల్లె  లోని నలుగురు పిల్లల దీన గాధ (కృష్ణవేణి మరియు రాజేంద్ర ప్రసాద్ ల పిల్లలు)  పరిస్థితి 27/7/2017 రోజు న సోషల్ వర్కర్ దుగ్గిగంగాదర్ గారు పేస్ బుక్ లో షేర్ చేసిన పోస్ట్ కు స్పందించి కాస్తంతైనా కువైట్ లోని  “మైత్రి సేవా సమితి” ద్వారా సహాయం చేసే సదుద్దేశ్యంతో వెల్లిన ఆ కార్యవర్గం కు అక్కడి హృధయ విదారక పరిస్థితులను చూసి కంట నీటికి, హృథయవేదన కి అడ్డుకట్ట వేయలేక పోయారు......

వీరికి మేము ఉన్నాము అని ముందుకు వచ్చిన కువైట్ లోని "మైత్రి సేవా సమితి" తనవంతు సహాయం గా  ఒక నెలకు సరిపడా నిత్యావసర సరుకులు సహాయంగా అందించి తాత ఆరోగ్యం కోసం ఆసుపత్రి ఖర్చులకు కొంతలో కొంత అందించింది.

ఇప్పుడు మా సహాయం తో మిగా వారు కుడా తమ వంతు సహాయాన్ని కూడా వీలైనంత అందించగలరనే ధృఢమైన నమ్మకంతో ఏవిషయాన్ని తెలియ చేస్తున్నాము అని కువైట్ లోని "మైత్రి సేవా సమితి" కార్యవర్గం తెలియ చేసింది.   కడప జిల్లా, మల్లెంవారిపల్లె లోని నలుగురు పిల్లల దీన గాధ... కువైట్ లోని “మైత్రి సేవా సమితి” ద్వారా సహాయం