కువైట్ లో మరియు గల్ఫ్ లో నిరంతరం పని చేసే వారికి ఉరట, కువైట్ లోని కళా కారులతో పూర్తి వినొద భరిత మరియు విన్నూత్న కార్యక్రమాలతో రూపుదిద్దుకొన్న You tube ఛానల్... “గల్ఫ్ బాబాయి”

Header Banner

కువైట్ లో మరియు గల్ఫ్ లో నిరంతరం పని చేసే వారికి ఉరట, కువైట్ లోని కళా కారులతో పూర్తి వినొద భరిత మరియు విన్నూత్న కార్యక్రమాలతో రూపుదిద్దుకొన్న You tube ఛానల్... “గల్ఫ్ బాబాయి”

  Mon Aug 07, 2017 12:17        Cinemas, Associations, Entertainment, Telugu, Kuwait, Gulf News

కువైట్ లో మరియు గల్ఫ్ లో నిరంతరం పని చేసే వారికి ఉరట, కువైట్ లోని కళా కారులతో పూర్తి వినొద భరిత మరియు విన్నూత్న కార్యక్రమాలతో రూపుదిద్దుకొన్న You tube ఛానల్... “గల్ఫ్ బాబాయి”

గల్ఫ్ లో మన తెలుగువాళ్ళు ఎక్కువ శాతం కార్మిక రంగం మరియు అరబ్ ల ఇళ్ళలో పనిచేసే వారే. వీరు నిరంతరం ఎంతో మానసిక వత్తిల్లతో ఇంక్కడ పని చేస్తుంటారు. వారికీ ఏ విధమైన వినోదం ఉండదు. పని పని పని. నిరంతరం పని మీదే ధ్యాస, మానసికం గా వత్తిడి. అప్పుడప్పుడు తెలుగు సినిమాలు వస్తాయి.. అవి వచ్చినపుడు వెళ్ళటానికి ఇళ్ళలో పని చేసే వారికి సెలవు దొరకదు. లేదా అధికమైన ఖర్చు..

పై వీడియొ వెంకట శివ రావు కోడూరి గారి తో ముఖాముఖి.

ఇలాంటి నేపద్యం లో వీరందరికీ కొంత రిలీఫ్ ఇవ్వాలి అనే ఆలోచనతో శ్రీ గిరి ప్రసాద్ కసా గారు వినుతనం గా అలోచించి గల్ఫ్ బాబాయి అనే వినోదాత్మక You tube చానల్ ను ఈ మద్యనే ప్రారంభించారు. దీనికి వారు ప్రస్తుతం పని చేస్తున్న అదే రంగం లో అనుభవం మరియు తన వద్ద పని చేస్తున్న మెరికల్లాంటి టీం ఉండడం తో ఈ చానల్ పెట్టడానికి వారికీ ప్రోత్సహన్ని ఇచ్చిందని చెప్పవచ్చు. ఈ చానల్ లో వచ్చే షార్ట్ ఫిలిమ్స్ వినోదాత్మకం గా ఉంటూ కువైట్ లోని ఎంతో మంది కళా కారుల తోనే హై టెక్ షూటింగ్ పరికరాలతో షూట్ చేసి మనకు అందివ్వబోతున్నారు.

పై వీడియొ శ్రీ . సుబ్బు గారి తొ గల్ఫ్ బాబాయ్ ముఖాముఖి.

ఈ సందర్భం గా ఎవరైనా ఇలాంటి విభాగాల్లో అంటే నటన పరం గా ఆసక్తి ఉన్నవారు ఆడ, మగ, పిల్లలు , పెద్దలు ఎవరైనా కుడా వీరిని సంప్రదిస్తే తుదుపరి తమ తీయబోయే ఫిలిమ్స్ లో అవకాశం ఇస్తామని తెలిపారు. ఇది నిరంతరం కొనసాగే పక్రియ కాబట్టి వారి వారి ఇంటరెస్ట్ మరియు సమయాన్ని బట్టి ప్రతి ఒక్కరికి ఛాన్స్ ఇవ్వడానికి వీలు ఉంటుంది.

ఈ గల్ఫ్ బాబాయ్ చానల్ ను ఎప్పుడైనా ఎక్కడైనా తమకు తీరిక దొరికిన సమయాల్లో చూసి ఆనందించ వచ్చు. అవి చూసి మీకు ఏమైనా సూచనలు, సలహాలు లేదా మీ వద్ద ఉన్న కొత్త ఆలోచనలు కామెంట్స్ రూపం లో పంచుకోవచ్చు.

ఇలాంటి వినోదాత్మకమైన వినూత్న ఆలోచనతో శ్రీ గిరి ప్రసాద్ కసా గారు ఈ గల్ఫ్ బాబాయ్ చానల్ తీసుకు రావడం ఎంతో సంతోషం గా ఉందని చాలా మంది తెలియ చేస్తున్నారు.

పై వీడియొ త్వరలో రాబోయే హాస్యం తో కూడుకున్న షార్ట్ ఫిలిం

దీనితో పాటు కువైట్ లో ఉన్న ప్రముఖుల ముఖాముఖి లతో వారి అనుభవాలను, వారు చేసే సేవ కార్యక్రమాలను, లేదా వారి వారి రంగాలో నైపుణ్యతను ఇక్కడ కువైట్ లో మరియు గల్ఫ్ లో పనిచేసే వారందరికి ఒక స్ఫూర్తి దయకం  గా ఉండాలనే సదుద్దేశ్యం తో NRI టాక్ షో అని పేరు పెట్టి ఇక్కడి ప్రముఖులతో ముఖాముఖి లు కుడా మొదలు పెట్టారు.

ఇందులో భాగంగా మన కడప సేవా సమితి అద్యక్షులు సుబ్బు గారితో ముఖాముఖి... అలాగే ప్రవాసాంధ్ర తెలుగు దేశం వర్కింగ్ ప్రెసిడెంట్, APNRT కువైట్ కో ఆర్డినేటర్ మరియు మాజీ తెలుగు కళా సమితి అధ్యక్షులు వెంకట్ శివ  కోడూరి గారితో ముఖాముఖీ లు ఇప్పటి వరకు వారి సైట్ లో ప్రసారం చేసారు. వారి వీడియొ లు తప్పకుండా చుడండి. ఈ వీడియొ లు అత్యంత క్వాలిటి తో ఉండటం గమనార్హం.

క్రింద ఇచ్చిన గల్ఫ్ బాబాయ్ లింక్స్ ఓపెన్ చేసి మీరు ఏ time లో కాలి గా ఉంటారో ఆ సమయం లో వీడియొ లు చూసి మీరు వారి పేజీలను like చేసి మీ స్నేహితులకు తెలిసే విధం గా వారికీ షేర్ చేయండి.  

మెయిన్ వెబ్ సైట్: www.gulfbabai.com

Face Book: https://www.facebook.com/babaigulf

You Tube: www.youtube.com/gulfbabai

Twitter: www.twitter.com/gulfbabai

ఈ వార్త మీ స్నేహితులకు షేర్  చేసి వారికీ తెలిసే విధంగా చేయండి.


   gulf babai, గల్ఫ్ బాబాయ్