కువైట్ లో కడప జిల్లా మాధవరం వాసి గత రెండు నెలలు గా జాబ్రియా ఆసుపత్రిలో మెదడు చచ్చిపోయి కోమాలో... భార్య డబ్భులు లేక 6 కిలో మీటర్ లు నడిచి రోజు హాస్పిటల్ కు రాకపోకలు... ఆర్ధిక సహాయం కోసం ఎదురు చూపులు, వేడుకోలు.. APNRT కో అర్దినేటర్స్ ముందడుగు...

Header Banner

కువైట్ లో కడప జిల్లా మాధవరం వాసి గత రెండు నెలలు గా జాబ్రియా ఆసుపత్రిలో మెదడు చచ్చిపోయి కోమాలో... భార్య డబ్భులు లేక 6 కిలో మీటర్ లు నడిచి రోజు హాస్పిటల్ కు రాకపోకలు... ఆర్ధిక సహాయం కోసం ఎదురు చూపులు, వేడుకోలు.. APNRT కో అర్దినేటర్స్ ముందడుగు...

  Sat Aug 05, 2017 13:28        Associations, Telugu, Kuwait, APNRT

కడప జిల్లా మాధవరం దగ్గర సిధవటం ఊరి వాసి “గోరె మౌలా” అనే వ్యక్తి కువైట్ కు పొట్ట చేత పట్టుకొని 20 సంవత్సరాల క్రితం వచ్చాడు. ఈ 20 సంవత్సరాలు చిన్న చితక ఉద్యోగాలు చేసుకుంటూ, కొద్దో గొప్ప అప్పులు చేసి  ముగ్గురు కుతుర్ల పెళ్ళిళ్ళు చేసి అతని భార్య తో ఇక్కడే ఉన్నాడు. గత కొన్ని నెలలు గా ఉద్యోగ అవకాశాలు లేక చేసిన అప్పులు తీర్చలేక ఎంతో మదనపడుతూ తన ఆరోగ్యాన్ని అతనికి తెలియకుండా పాడు చేసుకున్నాడు. అలా పాడవుతుందని అతనికి మరియు అతని భార్యకు కుడా తిలియదు.


గత రంజాను పండుగ రోజు తరువాత రెండో రోజు తీవ్రం గా జ్వరం వస్తే జబ్రియా లోని అల్ ముభారాక్ ఆసుపత్రికి తన భార్య తీసుకోని వెళ్లి చూపించింది. ఆ సమయం లో తనకి అధిక షుగరు, మరియు BP ఉండటం తో వెంటనే ఆసుపత్రిలో అడ్మిట్ చేసుకున్నారు.  ట్రీట్మెంట్ లో ఉండగానే రెండో రోజు అధిక BP తో మెదడు లోని నరాలు చిట్లి మెదడు చచ్చిపోయింది. అప్పటి నుండి అతను కోమాలోకి వెళ్లి పోయాడు. ఈ రెండు నెలలు ఎన్నో ఇన్ఫెక్షన్ లు ఉంటె వాటి శస్త్ర చికిత్స చేస్సారు. ప్రస్తుతం అతను ఏ చలనం లేక ఒక్క కళ్ళు మాత్రమే అడిస్తున్నాడు.

మెదడు చచ్చిపోయింది. రెండు నెలలు పైన అవ్వడం తో ఆసుపత్రి సిబ్భండి అతనిని డిశ్చార్జి చేస్తామని తెలిపారు. ఒక వేళ డిశ్చార్జ్ చేసిన యెడల అతనిని తప్పకుండా ఇండియాకు పంపవలసి ఉంటుంది. అలాగే ఇండియా లో అతను పైపుల ద్వారానే ఆహరం మరియు ఆక్షిజన్ ఇవ్వవలసి ఉంటుంది.  అతను బ్రతికినంత కాలం ఇదే విధం గా మంచం మీదే ఉంచవలసి ఉంటుంది. ఇది ఎంతో ఖర్చు తో మరియు ప్రయాసతో కూడుకున్న పని. అలాగే ఇండియాకు తరలించాలి అంటే అతనికి ప్రత్యకం గా ఏర్పాట్లు చేసి అనగా స్త్రేచ్చర్ మీదనే పంపాలి. అలాగే కూడా ఒక నర్సుని కడా పంపవలసి ఉంటుంది. దానికి సంభందించి ఖర్చు భారీగానే ఉంటుంది.

ఈ విషయాలన్నీ ఆలస్యం గా తెలుసున్న కువైట్ ఎన్నారైస్ మరియు APNRT మిడిల్ ఈస్ట్ మీడియా కో ఆర్డినేటర్ చప్పిడి రాజ శేఖర్ ఆసుపత్రికి వెళ్లి అన్ని విషయాలు తెలుసుకన్నారు. వెంటనే ఎంబసీ అధికారులను సంప్రదించి ఈ విషయమై చర్చించడం జరిగింది. ఈ విషయం లో టిక్కెట్ కు అయ్యే ఖర్చు ఎంబసీ ద్వార తీసి పంపుతామని తెలిపారు. చెన్నై ఎయిర్ పోర్ట్ నుండి కడప లోని గవర్నమేంట్ హాస్పిటల్ వరకు AP NRI మంత్రిత్వ శాఖ లోని ప్రోటోకాల్ విభాగం ద్వారా డాక్టర్ లు సూచించిన విధంగా అంబులెన్సు తాయారు చేసి ఇస్తుంది. ఆ తరువాత కడప గవర్నమేంట్ హాస్పిటల్ లో శస్త్ర చికిత్స కోరకు APNRT ద్వారా చేపిస్తారు. ఈ విషయాలన్నీ రాజ శేఖర్ సంభదిత అధికారులను సంప్రదించి పైన తెలిపిన విధం గా అరేంజ్ చేపించారు.

ఇక పోతే “గోరె మౌలా” భార్య పరిస్తితి మరీ దారునం గా ఉంది. సంపాదించే చెట్టంత మనిషి అచేతంగా కళ్ళ ఎదుట పెట్టుకొని కనీసం తినటానికి, రూమ్ కిరాయకి, రోజు ఆసుపత్రికి వెళ్లి రావటానికి చేతి లో డబ్భులు లేక ఎన్నో ఇబ్భందులు పడుతుంది. చాల సందర్భాల్లో కువైట్ లో ఉన్న 50 డిగ్రీల ఎండ లోనే 6 కిలో మీటర్లకు పైగా నడిచి వెళ్లి నడిచి వస్తుంది అంటే ఆమె పరిస్తితి ఎంత దారుణం గా ఉందొ మీరే ఉహించుకోండి. పైగా ఆవిడ ఆరోగ్యం కుడా అంతంత మాత్రమే. ఇలాంటి పరిస్తితుల్లో ఆమె భర్తను ఇండియాకు తరలిస్తే అక్కడ తనకు ఏ విధమైన ఆర్ధిక స్తోమత లేదు ఇంట్లో పెట్టుకొని ఖర్చు తో కూడుకున్న ఈ వైద్యం లేదా రోజువారి ఖర్చులు భరించటానికి.

ఇలాంటి పరిస్థితిలో ఉన్న ఈ కుటుంబానికి, APNRT కువైట్ కో అర్దినేటర్స్ టీం, కువైట్ ఎన్నారైస్ సహకారం తో వారికీ ఆర్ధిక సహాయం కొరకు కువైట్ లో ఉన్న దాతల నుండి కొంత జమ చేసి ఇవ్వాలని సంకల్పించింది. అలాగే APNRT ప్రెసిడెంట్ రవి గారితో చెర్చించగా, మా కు వెన్ను తట్టి ఒక మంచి కార్యక్రమం చేస్తున్నారు దిని apnrt నుండి కుడా సాధ్యమైన అంత సహాయం అందిస్తాము అని తెలిపారు. 

“గోరె మౌలా” కు ఈ ఖరీదైన వైద్యం జీవితాంతం చేయాలి కాబట్టి కువైట్ నుండి మనమందరం ఒక చేయి వేస్తె ఆ కుటుంబానికి సహాయం చేసిన వారమౌతము.  ఈ నిస్సహాయ కుటుంబానికి ఆర్ధిక సహాయం చేయతల్చిన దాతలు ముందుకు వచ్చి ఈ కుటుంబానికి సహాయం చేయవలసిందిగా ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కరించి వేడుకుంటున్నాము.

అలాగే కువైట్ లో ఉన్నఅన్ని సెవా సమితు లు ముందుకు వచ్చి ఈ కుటుంబానికి చేయూతను ఇవ్వవలసినదిగా ప్రార్ధన. మీరు ఎన్నో సేవలు ఇండియా లో మరియు ఇక్కడ చేస్తున్నారు. ఇప్పుడు మన కళ్ళ ఎదుట చెట్టు అంత మనిషి నిస్తేజం గా నిస్సహాయం గా ఉన్న ఈ మనిషి కి సహాయం చేసి మీ పెద్ద మనస్సు చాటుకుంటారని మా ఆశ.

ఈ సందర్భం గా ఈ విషయం మాకు తెలిసిన రోజు నుండి మేము (కువైట్ ఎన్నారైస్) ఈ సమస్యను మాతో కలసిన కొద్ది మంది తో సంప్రదిస్తున్న సమయం లో వారే ముందుకు వచ్చి కొంత అమౌంట్ ఇవ్వటం జరిగింది. ఆ వివరాలు...

ఖాదర్ భాష ప్రవాసాంధ్ర తెలుగు దేశం కువైట్ మైనారిటీ అధ్యక్షులు ఖాదర్ భాష (గోరె మౌలా విషయాన్నీ మా దృష్టికి తెచ్చిన వారు) కువైట్ దీనార్లు 20, APNRT కువైట్ కో ఆర్డినేటర్ మరియు ప్రవాసాంధ్ర తెలుగు దేశం వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకట్ శివ కోడూరి 20 దీనార్లు ఆసుపత్రికి వచ్చి  ఆమెకు తక్షణ ఖర్చుల నిమితం అక్కడే ఆమె చేతికి అందించారు.

అలాగే విషం తెలుసుకున్న మరో పేరు వెల్లడించడానికి ఇష్టపడని, కువైట్ లో ఉన్న తెలుగు వారిలో అత్యంత సేనియర్ మరియు ఎన్నో సమాజ సేవలలో ముందుకు వచ్చే పెద్దలు, పూజ్యులు అయినటువంటి వ్యక్తి 100 దీనార్లు ఇస్తామని కువైట్ ఎన్నారై కు తెలియ చేసారు. అదే విధం గా ఆంధ్ర సేవ సమితి అది కార ప్రతినిధి దడ్డం బ్రహ్మయ్య 50  దీనార్లు ఆంధ్ర సేవ సమితి ప్రెసిడెంట్ మరియు APNRT కో ఆర్డినేటర్ చంద్ర మౌళి కి తక్షణం అంద  చేసారు.         

ఆర్ధిక సహాయం చేయతల్చిన దాతలు క్రింద తెలిపిన వారికీ తమ సహాయయాన్ని అందించ వలసిందిగా ప్రార్ధన.

కువైట్ ఎన్నారైస్ ఈమెయిలు: kuwaitnris@kuwaitnris.com, whats అప్: +965 90001504, డైరెక్ట్: 60905470

పేస్ బుక్ పేజీలు: www.facebook.com/kuwaitnrisdotcom,

www.facebook.com/kuwaitnris

ఖాదర్ భాష: 55330726  

APNRT కువైట్ కో అర్దినేటర్స్: వెంకట్ శివ కోడూరి: 66860966

ఇతర  కో అర్దినేటర్స్ ల నంబర్స్ (ప్రస్తుతం కువైట్ లో ఉన్న వారు మాత్రమే ఈ లిస్టు లో ఉన్నారు గమనించ గలరు). మీ మీ ఏరియా లో ఉన్న వారు క్రింద తెలిపిన వారిని సంప్రదించి మీ సహాయాన్ని అందించ వలసింది గా మనవి.

గమనిక: సహాయాన్ని అందించిన ప్రతి వారి పేరును మరియు వారు ఇచ్చిన రోక్కన్ని ఇక్కడ కువైట్ ఎన్నారై లో తెలియచేయబడుతుంది. అలాగే APNRT వెబ్ సైట్ www.apnrt.com కూడా ఉంచబడుతుంది. (పారదర్శకం గా ఉండటం కొరకు మాత్రమే)
S.NO Name City Phone
1 Babu Naidu Polarapu kuwait city 99560433
2 Balaram Naidu salmiya 99411372
3 CHANDRA MOULI BYRISETTY KHAITHAN 50597814
4 Esdani Basha Shaikh SALMIYA 97266773
5 ESWARAIAH MADDINA Hawally 55013658
6 Haritha Duggirala Mangaf 96986838
7 JYOSTANA MUPPALA Abuhalifa 99823743
8 Kothapalli Rama Mohana Rao Rigai  66611918
9 Malepati Suresh Babu Naidu salmiya 99547190
10 marathi mallikarjuna naidu Rigai  99399442
11 Murali Babu Jelakara Farwaniya 99340686
12 NAGENDRA BABU AKKILI Salwá 51654644
13 Nagineni Ramesh Babu Farwaniya 50574777
14 Oleti Divakar Naidu Hawally 94448497
15 Pattabhi Ramu Kaperla Rawda 99532853
16 Peram Venkata Ramana Hawalli 99107659
17 PHANI KRISHNA PATURI salmiya 66744274
18 PRASAD K V N Sky net Farwaniya 66705777
19 Radha Madhav Venigalla Mangaf 55598178
20 Ravi Raju Regai 94443470
21 Sai Venkata Subba Rao Devata salmiya 50070019
22 Shaik Rahamathulla Salva 97586546
23 SUBBARAYUDU MULAKALA Hawally   55770769
24 Sudhakara Rao Kudaravalli Abu Halifa 50011442
25 Udaya Prakash Adusupalli SALMIYA 55524888
26 Venkata Siva Rao Koduri Abhu Halifaa  66860966
27 Venkata Subba Reddy  Shaab 95567947
28 Venkatesh Polina Fahaheel  55280222
29 Venkateswarlu Malepati Farwaniya 97959237
౩౦ Venkateswarulu Yegi Hawally 67004296

 

ఈ వార్తను దయ చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేసి ముదుకు వచ్చే దాతలకు తెలిసే విధం గా సహాయ పడండి.   కువైట్ లో కడప జిల్లా మాధవరం వాసి గత రెండు నెలలు గా జాబ్రియా ఆసుపత్రిలో మెదడు చచ్చిపోయి కోమాలో... భార్య డబ్భులు లేక 6 కిలో మీటర్ లు నడిచి రోజు హాస్పిటల్ కు రాకపోకలు..APNRT, Kuwait