మిథాలీకి షాకిచ్చి.. హర్మన్‌ పేరును సిఫార్సు చేసిన బీసీసీఐ!

Header Banner

మిథాలీకి షాకిచ్చి.. హర్మన్‌ పేరును సిఫార్సు చేసిన బీసీసీఐ!

  Thu Aug 03, 2017 20:58        India, Sports, Telugu

 టీమిండియా మహిళా జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్‌కు బీసీసీఐ షాకిచ్చింది. ఇటీవల జరిగిన మహిళల ప్రపంచ కప్‌లో జట్టును ఫైనల్‌కు చేర్చిన మిథాలీకి ‘ఖేల్‌రత్న’ ఖాయమని అందరూ భావించారు. అయితే బీసీసీఐ అందరి అంచనాలను తలకిందులు చేసింది. మిథాలీకి బదులు హర్మన్‌ప్రీత్ కౌర్ పేరును అర్జున అవార్డుకు సిఫార్సు చేసింది. ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై హర్మన్ అజేయంగా 171 పరుగులు సాధించింది. సుదీర్ఘకాలం జట్టుకు సేవలందిస్తున్న మిథాలీని కాదని హర్మన్‌ పేరును ప్రభుత్వానికి సిఫార్సు చేయడంపై క్రీడాభిమానులు మండిపడుతున్నారు. వరల్డ్ కప్‌లో వెయ్యి పరుగులు పూర్తి చేసి రికార్డు సృష్టించిన మిథాలీ పేరు అవార్డుల జాబితాలో లేకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
 
 
 
కాగా, ఖేల్‌రత్న అవార్డుకు పోటీపడుతున్న వారిలో భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్ సర్దార్ సింగ్, బాక్సర్ మనోజ్ కుమార్, పారా ఒలింపిక్ విజేతలు దీపా మాలిక్, దేవేంద్ర జజారియా, మరియప్పన్ తంగవేలు, వరుణ్ సింగ్ భాటీ తదితరులు ఉన్నారు.


   మిథాలీకి షాకిచ్చి.. హర్మన్‌ పేరును సిఫార్సు చేసిన బీసీసీఐ!