కువైట్ లో ప్రవాసులకు కొండంత అండగా ఉన్న భారత ఎంబసీ కార్యాలయం... వీసా ఆర్టికల్ 18 మరియు 20 లలో పనిచేస్తున్న వారి సమస్యలకు సత్వర పరిష్కారాలు... మరియు హెచ్చరికలు

Header Banner

కువైట్ లో ప్రవాసులకు కొండంత అండగా ఉన్న భారత ఎంబసీ కార్యాలయం... వీసా ఆర్టికల్ 18 మరియు 20 లలో పనిచేస్తున్న వారి సమస్యలకు సత్వర పరిష్కారాలు... మరియు హెచ్చరికలు

  Tue Aug 01, 2017 10:00        APNRT, కువైట్ న్యాయ సలహాలు, Embassy Row, Kuwait, Telugu

కువైట్ లో పనిచేస్తున్న ప్రవాసుల సమస్యలు  మరియు వాటి పరిష్కారాల పై భారత రాయభార కార్యాలయం ఇటివల ఒక ప్రకటన జారి చేసింది.

ఆ ప్రకటన ప్రకారం కువైట్ లో పనిచేస్తున్న వారు ఇటివల ప్రతి రోజు చాలా ఎక్కువ మంది సమస్యల తో ఎంబసీ వచ్చి తమ స్పాన్సర్ ల పై కంప్లైంట్స్ ఇస్తున్నారు. ముఖ్యం గా ఎక్కువ పని గంటలు, కొట్టడం, అసభ్య పదజాలలతో తిట్టడం, మానసికంగా హింసించడం, లేని పోనీ ఆరోపణలతో కేసులు పెట్టడం, జీతాలు సరైన సమయం లో చెల్లించక పోవడం, అగ్రిమెంట్ ప్రకారం ఒప్పుకున్న జీతం ఇవ్వక పోవడం, సమయానికి ఇండియా వెళ్ళటానికి సెలవులు ఇవ్వక పోవడం లాంటి సమస్యల పై కంప్లైంట్స్ ఇస్తున్నారు అని అధికారులు తెలిపారు. ఇలా వచ్చిన ఫిర్యాదులను వెంటనే వారి స్పాన్సర్ లతో/ కంపెనీ అది కారులతో /సంభదిత లీగల్ అధికారులతో  చెర్చించి సమస్య పరిష్కారం అవ్వడానికి కృషి చేస్తున్నారు.

ఇలా సమస్య తీవ్రతను అనుసరించి వీసా ఆర్టికల్ 18, 20, లతో పాటు ఆడవాళ్ళు పని చేసే విభాగాలు అయినటువంటి షాపులలో పనిచేసేవారు, బ్యుటి పారలల్ లో పనిచేసేవారు, టైలరింగ్ పని లో చేసేవారు, ఇళ్ళలో మెయిడ్ గా పని చేసేవారికి తక్షణం ఆర్ధిక సహాయం మరియు ఎంబసీ వారి నిర్వహణలో ఉన్న షెల్టర్ లో వసతి సౌకర్యం కల్పిస్తున్నారు. ఈ వసతి సౌకర్యం లో కి వెళ్ళ గానే వారికీ కొత్త డ్రెస్, కొత్త దుప్పట్లు, టవల్, నిత్య అవసరమైన సోప్స్, పెస్టూ, వండుకొని తినటానికి నిత్య అవసర సామగ్రి ఆదిస్తున్నారు. అయితే అలా వసతి గృహం లో ఉండ తలిచిన వారు మాత్రం ఎంబసీ వారు నియమించిన విధి విధానాలకు అనుసరించి ఉండాలి.

వారి స్పాన్సర్ కో ఆపరేషన్ చేసే దానిని అనుసరించి వారి సమస్య పరిష్కారం కాగానే వారికీ టిక్కెట్ ఇచ్చి ఇండియాకు పంపుతున్నారు. ఈ టికెట్ ఎంబసీ వారు కల్పించిన వసతి గృహం లో ఉన్న వారికీ మాత్రమె ఇస్తున్నారు.   

ఒక వేళ స్పాన్సర్ లేదా కంపెనీ వారు సహకరించక పోయిన ఎడల వారి కేసును మినిస్ట్రీ అఫ్ సోషల్ అండ్ లేబర్ మరియు పబ్లిక్ అథారిటీ ఫర్ మాన్ పవర్ లలో ఫిర్యాదు నమోదు చేస్తారు. దీనికన్నా ముందు సమస్యను సామరస్యకంగా పరిష్కరించాడని తీవ్రంగా ఎంబసీ వారు మాత్రం ప్రయత్నిస్తారు. అలా కానీ పక్షం లోనే కేసు ఫైల్ చేపిస్తారు.

ఇలాంటి సమస్యలు వీసా ఆర్టికల్ 20 లో పని చేసే మెయిడ్ లలో చాల ఎక్కువ గా వుండటం తో 2014 డిసెంబర్ నుండి ఎంబసీ అలాంటి కాంట్రాక్ట్స్ ను నిలుపుదల చేసింది. అలాగే వారి సమస్యలు మినిస్ట్రీ అఫ్ ఇంటీరియర్ పరిధిలోకి వస్తాయని, మిగతా కేసులు మినిస్ట్రీ అఫ్ సోషల్ అఫైర్స్ అండ్ లేబర్ పరిధి లోకి వస్తాయని తెలిపింది..

దీనితో పాటు ఎంబసీ అధికారులు కువైట్ లో ఉండేవారికి మరి కొన్ని విన్న పాలు మరియు హెచ్చరికలు కుడా జారి చేసారు. అవి ఏమంటే కువైట్ కు ప్రతి ఒక్కరు పని చేసుకొని డబ్బులు సంపాదించు కోవడాని వస్తారు కాబట్టి, కువైట్ కు సంభందించిన చట్టాలను గౌరవిచాలని, ఏవిధమైన అసాంఘిక విషయాలలో తల దూర్చ వద్దని, ఒక వేళ అలాంటి కేసు లలో ఇరుకున్న ఎదల ఎంబసీ ఏవిధమైన సహాయ సహకారాలు అందించదని స్పష్టంగా తిలియ చేసింది.    

గమనిక: మా తుదుపరి వ్యాసం లో ఎంబసీ కి ఏ విధమైన కేసులు వస్తూన్నాయి, వాటికీ ఎంత సమయం పడుతుంది అనే వివరాలతో మొదలైన వివరాలు ఉంటాయి... కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వెబ్ సైట్ ని డైరెక్ట్ గా ప్రతి రోజు చూస్తూ ఉండండి.

మా పేస్ బుక్ పేజి లను like చేయండి అదే విధం గా మీ స్నేహితులకు షేర్ చేసి వాళ్ళను కుడా like చేసే విధం గా సహకరించండి.

కువైట్ ఎన్నారైస్ డైరెక్ట్ లింక్: www.kuwaitnris.com

పేస్ బుక్ పేజి :   www.facebook.com/kuwaitnris

www.facebook.com/kuwaitnrisdotcom

ఈ వార్త కువైట్ లో ఉండే ప్రతి వారికి ఉపయుగా పడుతుంది కాబట్టి మీ స్నేహితులు అందరికి తప్పక షేర్ చేసి వారికి తెలిసే విధం గా సహాయం చేయండి.


   కువైట్ లో ప్రవాసులకు కొండంత అండగా ఉన్న భారత ఎంబసీ కార్యాలయం... వీసా ఆర్టికల్ 18 మరియు 20 లలో పనిచేస్తున్న వారి సమస్యలకు సత్వర పరిష్కారాలు... మరియు హెచ్చరికలు