ఎన్నారైల వృద్ధ తల్లితండ్రుల ఆరోగ్య సంరక్షణ కు APNRT సరికొత్త ఆలోచనతో సేవలకు సమాయత్తం... వారి వద్దకు ప్రయోగాత్మకంగా APNRT డాక్టర్స్ టీం... సేవలు అందుకున్న వారికి హద్దు లేని ఆనందం..

Header Banner

ఎన్నారైల వృద్ధ తల్లితండ్రుల ఆరోగ్య సంరక్షణ కు APNRT సరికొత్త ఆలోచనతో సేవలకు సమాయత్తం... వారి వద్దకు ప్రయోగాత్మకంగా APNRT డాక్టర్స్ టీం... సేవలు అందుకున్న వారికి హద్దు లేని ఆనందం..

  Mon Jul 31, 2017 08:00        APNRT, Exclusives, Gulf News, Helping Hand, India, Kuwait, Telugu

వృద్ధాప్యం ఓ భిన్నమైన జీవన దశ! కాలంతో పాటే యవ్వన ఛాయలు కరిగిపోతూ.. దశాబ్దాల శ్రమ ఫలితంగా శరీరం అరిగిపోతోందన్న సంకేతాలు ఆరంభమైనప్పుడే జాగ్రత్తలు తీసుకుంటే ఈ మలిదశను ఎంతో ఆనందంగా గడపొచ్చు. నిజానికి వృద్ధాప్యంలో పలకరించే సమస్యలు భిన్నంగా ఉంటాయి. వృద్ధుల అవసరాలూ భిన్నంగా ఉంటాయి. వృద్ధుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. జీవన ప్రమాణాలు మెరుగుపడి ప్రజల ఆయుర్దాయం పెరుగుతున్న కొద్దీ మన సమాజంలో వృద్ధుల సంఖ్య పెరుగుతోంది.

పిల్లల కుటుంబాలు ఎక్కడో ఇతర దేశాల్లో ఉంటే తల్లి తండ్రి అయిన వృద్ధ దంపతులు ఒంటరిగా తమ సొంత ఊరిలో కాలక్షేపం చేస్తూ ఉంటారు. అక్కడ ఉద్యోగాల వత్తిడి, ఇక్కడ తల్లి దండ్రుల ఆరోగ్య ఆందోళన రెంటి మధ్య ఎన్నారైలు అడకత్తెరలో పోకచెక్క స్థితి.

ఇకనుండి ఎన్నారైలకి ఇలాంటి సమస్య ఉండబోదని అంటున్నారు APNRT అధికారులు. ఎన్నారైలు పరాయి దేశాల్లో ఉద్యోగం చేస్తున్నంత కాలం వారి తల్లిదండ్రులకి తామున్నామని భరోసా ఇస్తున్నారు. వారికి ఏమి కావాలి, తమ అవసరం ఎంతవరకు ఉంది అన్నది పరిశీలించి వారు ఎక్కడున్నా సరే వెళ్ళి (మారుమూల గ్రామాలకైనా సరే) వృద్ధుల ఆరోగ్య  సంరక్షణా బాధ్యత తీసుకుంటామని వెల్లడి చేస్తున్నారు APNRT.

దీనిలో భాగం గా ఇటివలే ఎన్నుకోబడ్డ కొంత మంది ఎన్నారైల తల్లితండ్రుల వద్దకు ప్రయోగాత్మకంగా APNRT డాక్టర్స్ టీం ను పంపింది. ఈ సర్వీసు అందుకున్న వారిలో నేను (చప్పిడి రాజ శేఖర్) ఒకడిని. నాతో పాటు మిగతా వారి అనుభవాలను క్రోడీకరించి ఒక రచన రూపంలో మీకోసం.    

“మామ్మగారు నేను NRI అసుపత్రి నుండి డాక్టర్ ని కాల్ చేస్తున్నాను. విదేశం లో ఉన్న మీ అబ్బాయి మీ ఆరోగ్య  సంరక్షణా భాద్యతలు APNRT ద్వార మాకు అప్పచెప్పారు. మీ ఇంటికి వచ్చి మిమల్ని ఒకసారి పలకరించి, మీ ఆరోగ్యనికి సంభందించిన పరీక్షలు, చేసి వెళతాము. ఏరోజు ఎన్ని గంటలకు రమ్మంటారు?” అని ఫోన్ రాగానే ఈ NRI తల్లి త్రండ్రులకు తమ కొడుకే వచ్చి పరీక్షలు చేస్తున్నాడేమో ఆనందం కిలిగింది, రావాల్సిన రోజు సమయం ఆ డాక్టర్ కు చెప్పి ఈ విషయాన్నీ మారుమూలన ఉన్న తన గ్రమలోని స్నేహితులకు ఈ విషయాన్నీ ఆనందం గా పంచుకొని ఆ డాక్టర్ రాకకోసం ఎదురు చూస్తున్నారు ఆ వృద్ధ దంపతులు.

చెప్పిన రోజు చెప్పిన సమయానికి అటు ఇటుగా డాక్టర్ ఆ మారుమూల గ్రామంలోని వారి ఇంటికి వచ్చారు. రాగానే వారికీ రక్త పరిక్షలు, BP చెక్ చేసారు. ఆ తరువాత వారి మెడికల్ హిస్టరీ కి సంభందించిన ఫైల్ లో అన్ని పేపర్లు క్షున్నం గా పరీక్షించారు. దానితో పాటు ఆ ఫైల్ లో వాళ్ళ డాక్టర్ ఇచ్చిన సంభదిత మాత్రలు, టానిక్ లు, ఇంజెక్షన్ లు అన్ని సరి గా వాడుతున్నారో లేదో అడిగి తెలుసు కున్నారు. వారి తో ఆరోగ్య సమస్యలు అన్ని వివరం గా ఒక గంటకు పైగా చర్చించారు. తరువాత విదేశం లో ఉన్న వారి అబ్బాయి కి కాల్ చేసి అతని తో కూడా వారి సమక్షం లోనే అన్ని చర్చించి తుదుపరి ఏమి చేయాలో తెలిపారు. పెద్ద పరిక్షలకు టౌన్ లో ఉన్న తమ ఆసుపత్రికి వస్తే లైన్ లో నిలబడకుండా అవసరమైన అన్ని పరిక్షలు చేసి పంపుతామని తెలిపారు. తుదుపరి పరిక్షలకు తిరిగి 15 రోజులకు మల్లి వస్తామని చెప్పి వెళ్లారు.

డాక్టర్ గారు అన్ని పరీక్షలు చేసి వెళ్ళ గానే ఆ వృధ దంపతులకు చెప్పలేని ఆనందం, శక్తీ, నమ్మకం వారి కొడుపై అమిత ప్రేమ తో ఉప్పొంగిపోయారు. అలాగే విదేశాల్లో ఉన్న ఆ దంపతుల కొడుకు పరిస్థితి అంతే. ఎందుకంటే అలాంటి మారుమూల గ్రామం లో చిన్న పాటి జలుబు చేసినా దగ్గర లోని పట్టనానికి వెళ్లి చెకప్ చేసుకొని రావాలంటే ఆ వృద్ద దంపతులకి అతి పెద్ద ప్రయాసే మరి. అలాంటిది ఒక డాక్టర్ ఇంటికి వచ్చి తమ ఆరోగ్య పరిస్తితులు తెలుసుకొని ట్రీట్మెంట్ ఇవ్వడమంటే ఆషా మాషి వ్యవహారం కాదు కదా ఈ రోజుల్లో.

ఇలాంటి పరిస్తుతుల్లో APNRT అందివబోతున్న ఈ సేవలు అద్భుతం గా ఉందని చెప్పటం ఒక అతిశయోక్తి కాదు. ఈ సర్వీసు వినియోగం లోకి వస్తే ఎంతో మంది NRT లకు మరియు వారి తల్లి తండ్రులకు మానసిక క్షోభ, ఆందోళనకు చెక్ పెట్టినట్లే. ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా ఈ మానసిక ఆనందం మాత్రం మనం పొందలేమని ఘంటా పధం గా చెప్పగలం.   

సదా మీ సేవలో అని చెబుతున్న APNRT ఎవరైనా ఎన్నారైలు వారి తల్లి తండ్రుల సంరక్షణ అవసరం అనుకుంటే తమ విన్నపాలు APNRT కి పంపించవలసిందిగా విజ్ఞప్తి చేసుకుంటున్నారు. సత్వరం తమ సభ్యుల సహకారం అందుంతుంది అని APNRT తెలుపుతోంది. ఈ సేవలు కావలసిన వారు నామమాత్రం రుసుం చెల్లించాల్సి ఉంటుందని, ఎంత ఏమిటి అనేది ఇంకా ఏ ఏ సేవలు ఉంటాయి అనేది త్వరలో రూపుకల్పన చేసి ముందుకు తీసుకు వస్తామని APNRT ప్రెసిడెంట్ డాక్టర్ రవి వేమూరి మరియు CEO సాంబ శివ రావు గారు తెలిపారు.

ఇది కువైట్ ఎన్నారైస్ ప్రతేక వ్యాసం... రచన: చప్పిడి రాజ శేఖర్


   ఎన్నారైల వృద్ధ తల్లితండ్రుల ఆరోగ్య సంరక్షణ కు APNRT సరికొత్త ఆలోచనతో సేవలకు సమాయత్తం... వారి వద్దకు ప్రయోగాత్మకంగా APNRT డాక్టర్స్ టీం... సేవలు అందుకున్న వారికి హద్దు లేని ఆనందం