కువైతి ఇంట్లో పని చేస్తున్న అత్తిలి కి చెందిన మహిళకు తలకు గట్టి గాయం తో మృతి... కువైతి స్పాన్సర్ ఖర్చులతో మరియు APNRT/కువైట్ ఎన్నారైస్ సహకారం తో అత్తిలి చేరుకున్న దేహం.. హైదరాబాదు ఎయిర్ పోర్ట్ నుండి అత్తిలి వరకు ఉచిత అబులేన్సు అందించిన AP NRI మంత్రిత్వ శాఖ

Header Banner

కువైతి ఇంట్లో పని చేస్తున్న అత్తిలి కి చెందిన మహిళకు తలకు గట్టి గాయం తో మృతి... కువైతి స్పాన్సర్ ఖర్చులతో మరియు APNRT/కువైట్ ఎన్నారైస్ సహకారం తో అత్తిలి చేరుకున్న దేహం.. హైదరాబాదు ఎయిర్ పోర్ట్ నుండి అత్తిలి వరకు ఉచిత అబులేన్సు అందించిన AP NRI మంత్రిత్వ శాఖ

  Sun Jul 30, 2017 16:30        APNRT, Associations, Helping Hand, Kuwait, Telugu

అత్తిలి కి దగరలోని పాలూరు చెందిన ముప్పిడి ప్రభావతి పొట్ట చేత పట్టుకొని జీవనో పాదికి కువైట్ కు 4 సంవత్సరాల క్రితం వచ్చింది. అప్పటి నుండి ఒకే కువైతి ఇంట్లో పని చేస్తూ ఒక 6 నెలలు క్రితం ఇండియా కు కుడా వెళ్లి వచ్చింది. ఈ నెల 23 వ తేదిన అనుకోని పరిస్థితుల్లో క్రింద పడటం తో తలకు గాట్టి గాయమైది. రక్తపు మడుగులో ఉన్న ఆమెను తన స్పాన్సర్ వెంటనే హాస్పిటల్ కు తీసుకు వెళ్ళగా అప్పటికే చనిపాయిందని డాక్టర్లు తెలిపారు.

తలకు గాయమై చనిపోవడం తో పోలీసులు కేసు రిజిస్టర్ చేసుకొని విచారణ చేపట్టారు. ఎలా చనిపాయింది? ఎవరైనా కొట్టారా? లేకపోతే తోసేసరా అనే విషయాలు ఆ కువైతి స్పాన్సర్ కుటుంబాన్ని అదే విధం గా అక్కడ పని చేసే తోటి పని వారిని విచారిస్తున్నారు. ఈ లోపు మృత దేహం కు పోస్ట్ మార్టం ముగించి దేహాన్ని ఇండియా కు పంపడం కొరకు క్లియరెన్స్ చేసారు. అదే కువైతి దేహాన్ని పంపడం కొరకు చేయవలసిన అన్ని పేపర్ పనులు APNRT మిడిల్ ఈస్ట్ మీడియా కో ఆర్డినేటర్ మరియు కువైట్ ఎన్నరైస్ అధినేత చప్పిడి రాజ శేఖర్ మరియు ఎంబసీ సహకారం తో అతేనే తిరిగి పూర్తి చేసారు. అదే విధం గా కార్గో టికెట్ కుడా అతనే చెల్లించారు.

నిన్న 3 గంటలకు సభా ఆసుపత్రిలోని మర్చురిలో ఎంబసీ అధికారి, మృతు రాలి దగ్గర భంధువులు, కువైతి, మరియు రాజ శేఖర్ సమక్షం లో దేహాన్ని సెవ  పేటికలో సీల్ చేసి ఎయిర్ ఇండియా ఫ్లైట్ లో హైదరాబాద్ కు పంపించారు.

హైదరాబాద్ నుండి ఆమె స్వగ్రామమైన అత్తిలి కి సమీపం లోని పాలూరు కు ఆంద్ర ప్రదేశ్ NRI శాఖలోని ప్రోటోకాల్ సెక్షన్ అధ్వర్యంలో ఉచిత అంబులెన్సు ద్వార పంపించారు. ఈ ఉచిత అంబులెన్సు కొరకు కువైట్ ఎన్నారైస్ సంభదిత డాక్సుమేంట్ లు ఆ శాఖకు ఒక రోజు ముందే పంపి అంబులెన్సు సిద్దం చేపించారు. మృతురాలి భంధువులు ఎవరు అందుబాటు లో లేని కారణం గా మృత దేహం తో పాటు ఎవరు కూడా వెళ్ళలేక పోయారు. అయినా కాని  AP ప్రభుత్వం ప్రతినిధులు హైదరాబాదు ఎయిర్ పోర్ట్ కార్గో లో దేహాన్నితీసుకు వెళ్ళటానికి వచ్చిన వారి భందువుల సహకారం తో త్వరితగతిన క్లియరెన్స్ చేసి దేహాన్ని అప్పగించడం గమనార్హం.  

గమనిక: విదేశాల్లో ఆంధ్రప్రదేశ్ కు సంభందించిన వారు ఏదైనా అనివార్య కారణాలతో చనిపోతే వారి మృత దేహాన్ని చెన్నై లేదా హైదరాబాదు ఎయిర్ పోర్ట్ ల నుండి వారి స్వగ్రామాలకు ఉచితం గా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తమ ప్రభుత్వ  ఖర్చులతో అంబులెన్సు సర్వీస్ ను అందిస్తుంది. ఈ అవకాశాన్ని సంభదిత వ్యక్తులు సద్వినియోగం చేసుకోవలసింది గా కువైట్ ఎన్నారైస్ విజ్ఞప్తి చేస్తుంది. ఈ సందర్భం గా ఈ అంబులెన్సు సర్విస్ కావాలని అనుకునే వారు (ప్రపంచంలో ఏ దేశం లో ఉన్నఆంధ్ర ప్రదేశ్ NRIS) కువైట్ ఎన్నారై ను సంప్రదిస్తే ప్రభుత్వ అధికారులతో సంప్రదించి అంబులెన్సు సర్వీసు ను అరేంజ్ చేస్తుంది.

ఈ విషయం ప్రతి ఒక్కరికి చేరే విధం గా షేర్ చేయండి, వారికి ఈ విషయం తెలియ చేయండి.

కువైట్ ఎన్నారైస్ కు email: kuwaitnris@kuwaitnris.com లేదా whats app +96590001504 కు లేదా ++965 60905470 కు సంప్రదించండి. ఏ దేశం నుండి అయినా పర్వాలేదు. (2 రోజుల ముందు గా సంప్రదించిన, ఏ ఆటంకాలు లేకుండా అంబులెన్సు అరేంజ్ చేయబడుతుంది. గమనించ గలరు)


   కువైతి ఇంట్లో పని చేస్తున్న అత్తిలి కి చెందిన మహిళకు తలకు గట్టి గాయం తో మృతి