ఖేల్‌ర‌త్న క‌మిటీలో సెహ్వాగ్‌

Header Banner

ఖేల్‌ర‌త్న క‌మిటీలో సెహ్వాగ్‌

  Thu Jul 27, 2017 21:38        India, Sports, Telugu

క‌్రీడ‌ల్లో అత్యున్న‌త పుర‌స్కారం రాజీవ్ ఖేల్‌ర‌త్నతోపాటు అర్జున‌ అవార్డుల విజేత‌ల‌ను ప్ర‌క‌టించే క‌మిటీలో క్రికెట‌ర్ వీరేంద్ర సెహ్వాగ్ స్థానం సంపాదించాడు. అత‌నితోపాటు అథ్లెట్ పీటీ ఉష‌కు కూడా ఈ క‌మిటీలో స్థానం ద‌క్కింది. ఈ క‌మిటీలో మొత్తం 12 మంది స‌భ్యులు ఉంటారు. అటు ద్రోణాచార్య‌, ధ్యాన్‌చంద్ అవార్డుల విజేత‌ల‌ను ఎంపిక చేసే క‌మిటీలో బ్యాడ్మింట‌న్ కోచ్ పుల్లెల గోపీచంద్‌, స్నూక‌ర్ చాంపియ‌న్ పంక‌జ్ అద్వానీలు స్థానం సంపాదించారు.

    ఖేల్‌ర‌త్న క‌మిటీలో సెహ్వాగ్‌