మిథాలీ సేన‌కు బీసీసీఐ న‌గ‌దు పుర‌స్కారం

Header Banner

మిథాలీ సేన‌కు బీసీసీఐ న‌గ‌దు పుర‌స్కారం

  Sun Jul 23, 2017 21:26        India, Sports, Telugu

భార‌త మ‌హిళా క్రికెట‌ర్ల‌కు బీసీసీఐ భారీ న‌జ‌రానా ప్ర‌క‌టించింది. మిథాలీ రాజ్ నేతృత్వంలోని టీమిండియా ఐసీసీ వ‌ర‌ల్డ్‌క‌ప్ ఫైన‌ల్లో ప్ర‌వేశించిన విష‌యం తెలిసిందే. హోస్ట్ ఇంగ్లండ్ టీమ్‌తో ఆదివారం ఫైనల్ మ్యాచ్ జ‌ర‌గ‌నున్న‌ది. అయితే ఫైన‌ల్లో ప్ర‌వేశించిన మ‌హిళా క్రికెట‌ర్ల‌పై బీసీసీఐ ప్ర‌త్యేక న‌గ‌దు పుర‌స్కారాన్ని ప్ర‌క‌టించింది. వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో ఆడిన ప్ర‌తి ప్లేయ‌ర్‌కు రూ.50 ల‌క్ష‌ల క్యాష్ రివార్డును ఇవ్వ‌నున్న‌ది. ఈ విష‌యాన్ని ఇవాళ క్రికెట్ కంట్రోల్ బోర్డు తెలిపింది. టీమిండియాతో వెళ్లిన‌ స‌పోర్ట్ స్టాఫ్‌కు కూడా ఒక్కొక్క‌రికి రూ.25 ల‌క్ష‌ల న‌గ‌దు ఇవ్వ‌నున్నారు.   మిథాలీ సేన‌కు బీసీసీఐ న‌గ‌దు పుర‌స్కారం