సౌదిలో విశాఖకు చెందిన మహిళ కు ప్రత్యక్ష నరకం... హౌస్అరెస్ట్...

Header Banner

సౌదిలో విశాఖకు చెందిన మహిళ కు ప్రత్యక్ష నరకం... హౌస్అరెస్ట్...

  Thu Jul 20, 2017 15:11        Gulf News, Telugu

పొట్ట చేత పట్టుకొని, కుటుంబం ఆర్థిక సమస్యలను తీర్చడం కోసం, కన్నీళ్లను దిగమింగుకుని కుటుంబాన్ని వదిలి కష్టపడేందుకు ఇష్టంగా సౌదీ వెళ్లిన విశాఖపట్టణం కు చెందిన తెలుగు మహిళ సౌది ఇంట్లో  ఎన్నో కష్టాలు పడుతుంది.  విశాఖపట్టణం లోని  పెద గంట్యాడ దయాల్ నగర్‌కు చెందిన ప్రవీణ అనే మహిళ క్రితం ఏడాది సౌదీ అరేబియాకు వెళ్లింది. పెద్ద మొత్తంలో జీతం వస్తోందని ఆశించి, కుటుంబ సమస్యలు తీరతాయని తీరతాయని భావించి సౌదీలో ఓ ఇంట్లో పనిమనిషిగా చేరింది. మొదట్లో బాగానే ఉన్న సౌదీ యజమాని ఆ తర్వాత తన అసలు రూపం చూపించడం మొదలుపెట్టాడు.

ఆమెకు చిత్ర హింసలు మొదలయ్యాయి. ఇంట్లో నుంచి బయటకు రానివ్వకుండా హౌస్ అరెస్ట్ చేశారు. జీతం ఇవ్వకుండా, సరిగా తిండిపెట్టకుండా నరకం చూపించారు. ఇక భరించలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన బాధలను ఏకరువు పెడుతూ వీడియో తీసి భర్త అశోక్‌కు పంపిందామె. తనను బతికించాలంటూ దీనంగా వేడుకుందామె. దీంతో అప్రమత్తమయిన భర్త.. స్థానిక పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. తన భార్యను సురక్షితంగా విశాఖ తీసుకురావాల్సిందిగా అధికారులను, ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాడు. కన్న తండ్రి చనిపోయాడని చెప్పినా భార్యను పంపించలేదనీ, ఎలాగైనా రక్షించాలని అతడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు...

 


   సౌదిలో విశాఖకు చెందిన మహిళ కు ప్రత్యక్ష నరకం... హౌస్అరెస్ట్.