కువైట్ లో భారిగా స్పందన... APNRT ప్రెసిడెంట్ డా. రవి వేమూరి కువైట్ పర్యటన ఘన విజయం... ప్రవాసులకు భరోసా కల్పించిన ముఖ్యమంత్రి చంద్ర బాబు..

Header Banner

కువైట్ లో భారిగా స్పందన... APNRT ప్రెసిడెంట్ డా. రవి వేమూరి కువైట్ పర్యటన ఘన విజయం... ప్రవాసులకు భరోసా కల్పించిన ముఖ్యమంత్రి చంద్ర బాబు..

  Mon Jul 17, 2017 07:00        APNRT, Associations, Kuwait, Telugu

APNRT అనగా ఆంధ్ర ప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు. ఇది AP ప్రభుత్వ భాగాస్వామ్యం  లోని ఒక సొసైటి. దీనిని విదేశాలలో ఉంటున్న ప్రతి AP తెలుగు వారి సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన ఒక సొసైటి (సంస్థ). విదేశాలలో ఉంటున్న ప్రతి తెలుగు వారు విధి గా ఈ సంస్థ లో సభ్యత్వం నమోదు చేసుకుంటే వారికి ఒక ID నెంబరు వస్తుంది. ఈ నెంబరు ఆధారం గా ఆపదల్లో ఉన్న వారికీ APNRT తగిన రీతిలో సహాయం చేయడానికి అవకాశం ఉంటుంది.


ఈ విషయం పై అవగాహన కల్పించడానికి దీని ప్రెసిడెంట్ శ్రీ రవి వేమూరు గారు కువైట్ కు 13 మరియు 14 న పర్యటించారు.  ఈ సందర్భం గా రవి గారు మరియు కువైట్ లో కో అర్దినేటర్స్ గా నియమించ బడిన కో అర్దినేటర్స్, కువైట్ లోని వివిధ ప్రాంతాలలో పర్యటించి తెలుగు వారి కి అవగాహనా సదస్సులు నిర్వహించారు. ఈ అవగాహనా సదస్సుల్లో AP ప్రభుత్వం కొత్తగా ప్రవేశ పెట్టబోతున్న గల్ఫ్ ప్రవాసిల పాలసి పై అవగాహన దాని మూలం గా ఇక్కడ ఇబ్బందుల్లో ఉన్న వారికీ ఎవిదం గా ప్రభుత్వం తోడ్పాటునిస్తుంది అనే విషయమై అవగాహన కల్పించారు. అదే విధం గా ప్రభుత్వం తమకు ఏమిచేస్తే బాగుంటుంది అనే విషయమై సలహాలు సూచనలు కూడా తీసుకున్నారు.

ఈ సందర్శన లో భాగంగా 13 వ తారీకున కువైట్ కో అర్దినేటర్స్ తో ఎంబసీ పర్యటించి అంబాసిడర్ శ్రీ సునీల్ జైన్ గారి తో చర్చలు జరిపారు.  ఈ చర్చల్లోAP ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు గారు విదేశాల్లో ఉంటున్న తెలుగు వారికి ఏవిదం గా సేవ చేయాలి అనే విషయం మీద కొత్త గా తయారు చేసిన "వలస దారుల సాంఘిక సంక్షేమ పాలసి" గురించి అంబాసిడర్ కు వివరించి అయన వద్ద నుండి కుడా విలువైన సూచనలు తీసుకున్నారు. అలాగే AP ప్రభుత్వం నుండి ప్రతి నెల ఎవరో ఒకరు విరివిగా కువైట్ కు పర్యటించి ఇక్కడ నివాసం ఉంటున్న తెలుగు వారి ని కలుస్తూ ఉంటుంటే మరిన్ని సమస్యలకు పరిష్కార మార్గాలు తెలుస్తాయని అంబాసిడర్ శ్రీ సునీల్ జైన్ తెలిపారు.

ఎంబసీ పర్యటనకు ముందు కువైట్ లోని ప్రముఖ కంపినిలలో ఒకటైన గల్ఫ్ స్పిక్ కంపని ని సందర్శించి ఇక్కడ కార్మికలు ఎలా పనుల్లో ఉంటారో స్వయం గా తెలుసుకున్నారు. అదే విధం గా స్కిల్ డెవలప్మేంట్ ఆంధ్ర లో ఎలా డెవలప్మేంట్ చేయ వచ్చు అనే విషయం పై కూడా ఒక అవగాహన కొరకై ఈ కంపని సందర్సనలో ఒక అవగాహనకు వచ్చారు.

ఆ తరువాత, స్తానికంగా ఉన్న డొమెస్టిక్ సర్వెంట్ మాన్ పవర్ ఏజెంట్ల తో సమావేశం అయ్యారు. ఈ సమావేశం లో డొమెస్టిక్ సర్వెంట్స్ ను ఎలా తీసుకు వస్తారు, ఏ విధం గా తీసుకుసు వస్తున్నారు, ఏ విధంగా కువైటి వారికీ పంపిస్తారు అనే పలు విషయాలు ఆసక్తి గా అడిగి తెలుసుకున్నారు. ఈ విషయం లో ఏ విధం గా ప్రభుత్వం తరపు నుండి సహాయ పడగలరో తగు సూచనలు సలహాలు తీసుకోని ఒక అవగాహన తెచ్చుకున్నారు.  

సాయంత్రం 7 గంటలకు హాలిడే ఇన్ బాల్ రూమ్ లో కువైట్ కో అర్దినేటర్స్   తో Migrants welfare and development Policy పై అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సు లో International Labor Organization తరపున పంపించిన Mr. Mathew Thomas చక్కటి అవగాహన కల్పించారు.  ఈ సదస్సు సాయంత్రం 7 గంటలకు మొదలై అర్ధ రాత్రి 12 గంటల వరకు కొనసాగటం విశేషం. ఇందులో APNRT ప్రెసిడెంట్ డా. రవి వేమూరి APNRT ముఖ్య ఉద్దేశ్యాలు, మెంబర్ షిప్ లు ఎందుకు చేయాలి, దాని వలన ప్రయోజనం ఏమిటి, అసలు  కో అర్దినేటర్స్   చేయవలసిన పని ఏమిటి? ప్రభుతం ఏమి చేయబోతుంది అనే విషయాలమీద చక్కగా వివరించి చెప్పారు.

తరువాత 14 వ తేదిన 8 గంటలకు అభు హలిఫా ప్రాంతం లో ఏర్పాటు చేసిన బ్రేక్ ఫాస్ట్ మీట్ లో దాదాపు 100 మంది కి పైగా వివిధ రకాల ఉన్నత ఉద్యోగాలు చేస్తున్న వారితో సమావేశం అయ్యారు.  ఈ సమావేశం  దాదాపు 4 గంటలు పాటు జరిగింది. ఈ సందర్భం గా పలువురి సందేహాలకు ఓపిక గా సంమాధానాలు ఇచ్చి APNRT యొక్క ముఖ్య ఉద్దేశ్యాలు తెలిపారు.

12-30 కు షర్క్ లోని కడప మసిద్ లో దాదాపు 150 మంది ముస్లిం కమ్యూనిటి వారి తో సమావేశం అయ్యారు. అక్కడ వారి సమస్యలు అడిగి తెలుసుకొని apnrt గురించి వివరించి చెప్పారు.

ఆ తరువాత కువైట్ లోని పారిశ్రామిక వేత్తలతో ఏర్పాటు చేసిన లంచ్ కార్యక్రమం లో సమావేశం అయ్యారు. దీన్లో భాగంగా AP ప్రభుత్వం మరియు APNRT చేపడుతున్న పారిశ్రామిక పాలసీ ల పై చెర్చించారు. AP లో  పెట్టుబడుల పై అవకాశాలు మరియు పెట్టుబడులు పెడితే లాభాలపై వివరించారు. ఈ సందర్భం గా కొంత మంది పెట్టుబడులు పెడటానికి ఆసక్తి చూపడం విశేషం.

ఈ కార్యక్రం తరువాత ఖైతాన్ పార్క్, ఒమారియా పార్క్ లలో వివిధ రకాల వృత్తులలో, మరియు కువైటి ల ఇళ్ళలో పనిచేస్తున్నవారితో కలిసి apnrt గురించి మరియు వారికొరకు చేపట్టబోవు సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించి apnrt లో సభ్యులుగా చేరితే ప్రయోజనాల గురించి విడమర్చి చెప్పారు.

అలాగే 7 గంటలకు ఫర్వనియలో క్రైస్తవులు జరుపుకునే ప్రార్ధన ప్రదేశం లో ౩౦౦ వందలకు పైగా హాజరైన ప్రార్ధనా మందిరంలో కూడా సమావేశం అయ్యారు. ఈ సభలో 250 మిందికి పైగా మహిళలు హాజరై శ్రద్ధగా ఆలకించడం మరియు అర్ధం చేసుకొని సంతోషం వ్యక్తం చేయడం ఒక విశేషం.

ఆ తరువాత చివరి సమావేశం గా నిర్వహించిన సమావేశం వివిధ సంఘాల ప్రతినిదులతో జరిగింది. 9 గంటలకు మొదలైన ఈ సమావేశం 12 గంటల వరకు కొనసాగింది, ఈ సమావేశం లో దాదాపు 40 సంఘాలు APNRT తో MOU ల పై సంతకాలు చేసుకోవడం ఒక శుభ పరిణామం. కువైట్ లో 100 లలో సంఘాలు మరియు గ్రామ సంఘాలు ఉన్నాయి. వీరందరికీ కుడా సమాచారం ఇచ్చి వారి తో కుడా MOU చేపించుకొనే విధం గా వివరించి చెప్పాలని కువైట్ కో అర్దినేటర్స్ కు మరియు అక్కడకు వచ్చిన సంఘ నాయకులకు రవి గారు విన్నవించుకున్నారు..

మొత్తానికి, ఈ రెండు రోజుల పర్యటనలో కువైట్ లో 50 డిగ్రిలకు పైగా ఉన్న ఎండను, అధిక హ్యుమిడిటి ను సైతం లెక్క చేయకుండా ఒక్క నిమిషం విశ్రాంతి లేకుండా, ఒక్క నిమిషం వృధా కాకుండా ఒపిగాక ఎన్నో సమావేశాలలో పాల్గొని apnrt గురించి కువైట్ లోని తెలుగు వారికీ వివరించి ఇక్కడి వారిలో చేతన్యం తీసుకు రావడం లో apnrt ప్రెసిడెంట్ శ్రీ రవి కుమార్ వేమూరి గారు విజయం సాధించారని అనడం లో ఏ మాత్రం సందేహం లేదు. కువైట్ లో వారిని చూసిన, కలిసిన ప్రతి ఒక్కరు అయన పడుతున్న తాపత్రయం చూసి ఇన్నాళ్ళకు మాకొరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరియు రవి గారు ఒక మంచి ఆలోచనా విధానాలతో మేలు చేయబోతున్నారు అని ఒక బరోసా కల్పించారని ఆనందం వ్యక్తం చేయడం ఒక శుభ పరిణామం.

ఇక చివరిగా ఇప్పటివరకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తరపున ప్రభుత్వ ఖర్చులతో తెలుగు వారి కొరకు కువైట్ కు రావడం apnrt ప్రెసిడెంట్ శ్రీ రవి కుమార్ వేమూరి గారు ప్రధముడు కావడం మరో విశేషం. మరియు ఆనంద దాయకం, ఈ పరంపర ఇక ముందు కుడా కొనసాగుతుందని ప్రతి ఒక్కరు ఆశిస్తున్నారు.

ఈ పర్యటన లో కువైట్ లో ఉన్న కో ఆర్దినేటర్స్ అందరు ఎంతో శ్రద్ధగా, ఆశక్తి గా, డెడికేట్ గా, చక్కటి సమన్వయం తో కష్టపడుతూ, ప్రతి సమావేశం ఏర్పాటు చేసి రవి గారి పర్యటనను విజయవంతం చేయటం లో పాలు పంచుకున్నారు.. అలాగే కో అర్దినేటర్స్ కాక పోయినా చాల మంది కుడా ప్రత్యక్షం గా మరియు పరోక్షం గా సహకారాలు అందించారు. వీరందరికీ శ్రీ రవి గారు తన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియ చేసారు.

15 జూలై ఉదయం 6 గంటలకు బైలు దేరి దుబాయ్ పర్యటనకు వెళ్లారు. అక్కడ 15 , 16 తేదిలలో కువైట్ లో మాదిరిగా నే సమావేశాలలో పాల్గొంటారు.


   కువైట్ లో భారిగా స్పందన... APNRT ప్రెసిడెంట్ డా. రవి వేమూరి కువైట్ పర్యటన ఘన విజయం... ప్రవాసులకు భరోసా కల్పించిన ముఖ్యమంత్రి చంద్ర బాబు