కూకట్‌పల్లిలో అదృశ్యమైన పదో తరగతి బాలిక పూర్ణిమ ఆచూకీ ముంబైలో లభ్యం

Header Banner

కూకట్‌పల్లిలో అదృశ్యమైన పదో తరగతి బాలిక పూర్ణిమ ఆచూకీ ముంబైలో లభ్యం

  Sun Jul 16, 2017 21:55        India, Telugu

 హైదరాబాద్ కూకట్‌పల్లి నిజాంపేట్‌ నుంచి 40 రోజుల క్రితం అదృశ్యమైన పదోతరగతి బాలిక పూర్ణిమ ఆచూకి ముంబైలో దొరికింది. జూన్‌ ఏడున స్కూల్‌కు వెళ్తున్నానని చెప్పిన పూర్ణిమ తిరిగి రాలేదు. దీంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు 14 బృందాలుగా విడిపోయి పూర్ణిమ కోసం గాలించారు. సినిమాల్లో నటించాలనే కోరిక పూర్ణిమకు ఉందని ఆమె తల్లిదండ్రులు చెప్పడంతో పోలీసులు ముంబై, చెన్నై సహా పలుచోట్ల వెతికారు. అన్ని స్టూడియోలను సంప్రదించారు. దాదార్‌లోని ఓ స్టూడియో వద్ద ఉన్న పూర్ణిమను ముంబై పోలీసులు బాల్‌సుధార్ అనే ఎన్జీవోలో చేర్పించారు. హైదరాబాద్ పోలీసులు ముంబై పోలీసులను ఆశ్రయించడంతో పూర్ణిమను గుర్తించారు. వాస్తవానికి మూడ్రోజుల క్రితమే పూర్ణిమ మిస్సింగ్ కేసును పోలీసులు కిడ్నాప్ కేసుగా మార్చారు. పూర్ణిమ కథ సుఖాంతం కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పూర్ణిమను హైదరాబాద్ తీసుకువచ్చేందుకు పోలీస్ బృందం ముంబై వెళ్లిందని బాచుపల్లి సిఐ బాలకృష్ణారెడ్డి తెలిపారు. 



   కూకట్‌పల్లిలో అదృశ్యమైన పదో తరగతి బాలిక పూర్ణిమ ఆచూకీ ముంబైలో లభ్యం