డ్రగ్స్ కేసులో పోలీసుల వద్ద టాలీవుడ్ ప్రముఖుల వీడియో పుటేజ్!

Header Banner

డ్రగ్స్ కేసులో పోలీసుల వద్ద టాలీవుడ్ ప్రముఖుల వీడియో పుటేజ్!

  Sun Jul 16, 2017 21:50        Cinemas, India, Telugu

డ్రగ్స్ కేసులో పోలీసుల దగ్గర కీలక ఆధారాలున్నాయా? త్వరలోనే బయటపెట్టే అవకాశం ఉందా? కెల్విన్‌ను కలిసి ఎవరెవరూ మాట్లాడారు. ఆ వీడియో పుటేజ్ పోలీసులకు దొరికిందా? వీడియోలో ఉన్నది మొత్తం ఆ డైరెక్టర్ గ్రూపేనా? ఏం జరుగబోతుంది ఇప్పుడు? టాలీవుడ్ డ్రగ్స్ ప్రకంపనల్లో మారుమ్రోగిపోతున్నది పూరీ జగన్నాథ్ పేరే. కేవలం పూరి మాత్రమే కాదు. ఈ దర్శకుడి టోటల్ టీం మత్తులో ఊగుతోందంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. నిన్నటి వరకు బయటపడ్డ పేర్లు వాస్తవమేనని నిర్ధారిస్తూ ఇప్పడు వీడియో పుటేజ్ దొరికిందా? కెల్విన్ మొబైల్‌ను పరిశీలిస్తున్న కొద్దీ అవాక్కయ్యే వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి. ఇప్పటికే కొందరికి నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. మరో లిస్ట్ రెడీగా ఉందని సమాచారం. ఏ క్షణం ఏం జరుగుతుందోనని మత్తు బాబులు బిక్కుబిక్కుమంటున్నారు. తమకు నోటీసులు రాలేదని కొందరూ.. వచ్చాయి కానీ డ్రగ్స్ ఎలా ఉంటుందో తెలియదని కొందరూ వాధిస్తున్నారు. ఇంగ్లీష్ మందే వాడను డ్రగ్స్ ఎలా వాడతానని మరి కొందరు అన్నారు. అధికారికంగా ఇప్పటి వరకు పేర్లు ప్రకటించలేదు. కానీ ఈ మత్తులో జోగుతున్న టీం మాత్రం దాదాపుగా తెలిసిపోయింది. అయితే నిన్నటివరకు నోటి లెక్కలే కానీ.. ముందుంది విజువల్ ఎఫెక్ట్ అంటున్నారు పోలీసులు.
 
 
ఎవరి లెక్కా ఎలా ఉన్న మొత్తం దృష్టి పూరి చుట్టూ తిరుగుతోంది. ఎందుకంటే డ్రగ్స్ నోటీసులు అందుకున్న వారంతా పూరీ టీమే. ఈ విషయం దాదాపు నిర్దారణ అయిపోయింది. అయితే నిన్నటి వరకు కెల్విన్ ఫోన్లో డేటాను మాత్రమే తీసుకున్న పోలీసులకు తాజాగా రెండు వీడియోలు దొరికాయట. కెల్విన్‌తో డ్రగ్స్ వ్యవహారంపై కొందరు మాట్లాడుతున్న వీడియోలేనని తెలుస్తోంది. మరీ ముఖ్యంగా వీడియోలో ఉన్నది పూరీ సన్నిహితులేనని బలమైన టాక్ వినిపిస్తోంది. ఈ వీడియోలు బయటపడితే పూరీ గ్యాంగ్ పరిస్థితేంటి? కాల్‌డేటా బయటకు తీసి ప్రశ్నింస్తే ఎలాగోలా తప్పించుకోవచ్చు. ఎందుకంటే బడా దర్శకుల ఫోన్లు పీఏ, అసిస్టెంట్ డైరెక్టర్, డ్రైవర్ వద్దో ఉంటుంది. వ్యక్తిగత ఫోన్ వేరే ఉంటుందని అందరికీ తెలిసిందే. అయితే అందరికీ తెలిసిన నెంబర్ కాబట్టి.. తమ యూనిట్ సభ్యులకు ఎవరికైనా ఫోన్ చేసి ఉండవచ్చని, తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పే అవకాశం ఉంది. కానీ వీడియో పుటేజ్ అంటే తప్పించుకునే అవకాశం లేదు. పైగా మరింత ఉచ్చు బిగిసినట్టే.
 
ఓ హీరోయిన్ డ్రగ్స్ కోసం ఎక్కడికి పిలిస్తే అక్కడి వస్తుందని కెల్విన్ పోలీసులుకు చెప్పినట్లు సమాచారం. ఐటెం సాంగ్స్ బ్యూటీ డ్రగ్స్ కోసం రకరకాలుగా ప్రవర్తిస్తుందని కెల్విన్ విచారణలో తెలిపాడట. దీంతో వాళ్లిద్దరూ ముమైత్ ఖాన్, చార్మీ అని అందరూ ఫిక్స్ అయ్యారు. అయితే ఈ వీడియోలు బయటకు వస్తే పూరీ చుట్టూ ఉచ్చుబిగిసినట్టేనా? లేకుంటే డ్రగ్స్ వ్యవహారంలో మరింత క్లారిటీ వచ్చినట్టా? ఈ వ్యవహారంలో ప్రధానంగా రెండు వాదనలు వినిపిస్తున్నాయి. మాట్లాడిన వారు పూరీ సన్నిహితులైనా.. పూరీ ప్రమేయం ఉందని ఎలా నిర్ధారించగలరు? అలాగని చెప్పి పూరీ ప్రమేయం లేదని తేల్చడం సాధ్యమేనా ఇలాంటి సవాలక్ష ప్రశ్నలు ఎదురవుతున్నాయి.


   డ్రగ్స్ కేసులో పోలీసుల వద్ద టాలీవుడ్ ప్రముఖుల వీడియో పుటేజ్!