ఫేస్‌బుక్‌ నేరాల్లో కొత్తకోణం

Header Banner

ఫేస్‌బుక్‌ నేరాల్లో కొత్తకోణం

  Sun Jul 16, 2017 20:41        India, Social Network Hal Chal, Telugu

 స్వలింగ సంపర్కాన్ని అడ్డంపెట్టుకొని ఫేస్‌బుక్‌ సాయంతో నేరాలకు పాల్పడ్డ యువకులను విశాఖ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఫేస్‌ బుక్‌లో గే గ్రూప్‌ను ఏర్పాటు చేసి స్వలింగ సంపర్కానికి ఆసక్తి ఉన్నవారిని ఆహ్వానించి.. తర్వాత‌ బ్లాక్‌మెయిల్ చేయ‌డం ఫేస్‌బుక్ నేరాల్లో కొత్త కోణమని విశాఖ‌ నగర సంయుక్త పోలీస్‌ కమిషనర్‌ నాగేంద్ర కుమార్ తెలిపారు.

పోలీసుల క‌థ‌నం ప్ర‌కారం... విశాఖకు చెందిన తాడి రాహుల్‌ ఓ ప్రైవేట్‌ కంపెనీలో పనిచేస్తూ ఎంవీపీ కాలనీలో ఓ హాస్టల్‌లో ఉంటున్నాడు. వైజాగ్‌ మేల్ టు మేల్‌ ఓన్లీ వైజాగ్‌ బాయ్స్‌ అన్న పేరుతో ఉన్న స్వలింగ సంపర్కుల ఫేస్‌బుక్‌లో గత నెలలో తాను చేరాడు. ఇందులో 2,335 మంది సభ్యులు ఉన్నారు. విశాఖకు చెందిన ముక్కాల ఆదిత్య, అమీరుద్దీన్‌ఖాన్‌, పెంట అరుణ్‌ కుమార్‌, ఉంగరాల రవిరాజ్‌, దంతా జితేష్‌లు ఒక ముఠాగా ఏర్పడి రాహుల్‌ను బ్లాక్‌మెయిల్‌ చేసి రూ.2లక్షలు దోచుకున్నారు.

ఇందులో ఆదిత్య అనే యువకుడు మరోపేరుతో ఫేస్‌బుక్ ఖాతా తెర‌వ‌గా.. రాహుల్ అత‌డితో స్వలింగ సంపర్కానికి ఆసక్తి కనపరిచాడు. దీంతో ఆదిత్య త‌న స్నేహితుల‌తో క‌లిసి రాహుల్‌ ఉంటున్న హాస్టల్‌కు వెళ్లాడు. అక్కడ రాహుల్‌ను బట్టలు విప్పేసి, ఈ అయిదుగురు యువకులు వీడియో చిత్రీకరించి, బ్లాక్‌ మెయిల్ చేశారు. తమకు రెండున్నర లక్షలు ఇవ్వకపోతే వీడియోలు పోలీసులకి, మీడియాకు ఇస్తామని బెదిరించడంతో అప్పటికప్పుడు తన అకౌంట్‌లో ఉన్న రెండు లక్షల రూపాయలను వారికి బదిలీ చేశాడు. దీనిపై బాధితుడు పోలీసులను ఆశ్రయించగా, ఈ యువకుల ముఠాను పట్టుకున్నారు. ఇందులో ప్రధాన నిందితుడు ఆదిత్య గాజువాక, గోపాలపట్నం, పి.ఎం.పాలెం ప్రాంతాల్లోనూ ఈ తరహా మోసాలకు పాల్పినట్టు పోలీసులు చెప్పారు. ఇంకా ఎవ‌రైనా బాధితులుంటే త‌మ‌ను సంప్ర‌దించాల‌ని.. వివ‌రాలు గోప్యంగా ఉంచుతామ‌ని పోలీసులు చెబుతున్నారు.సూచిస్తున్నారు.   ఫేస్‌బుక్‌ నేరాల్లో కొత్తకోణం