అయ్యా APNRT రవయ్య! కువైట్ కు పొట్ట చేత పట్టుకొని వచ్చామండయ్యా!! మేమున్నామనే భరోసా ఇవ్వండయ్య

Header Banner

అయ్యా APNRT రవయ్య! కువైట్ కు పొట్ట చేత పట్టుకొని వచ్చామండయ్యా!! మేమున్నామనే భరోసా ఇవ్వండయ్య

  Thu Jul 13, 2017 09:00        APNRT, కువైట్ మెయిడ్ మార్కెట్, Kuwait, Rachanalu (రచనలు), Telugu

కువైట్ కు APNART ప్రెసిడెంట్ ఈ రోజు ఉదయం 5 గంటలకు కువైట్ వచ్చారు. ఈ సందర్భం గా కువైట్ లో నివసిస్తున్న వారి ఆవేదన మరియు అసలు కవిత రూపంలో

అయ్యా మీరెవరో వస్తున్నారంటయ్యా

మా బాధలు  వింటారంటా కదయ్యా

 

వినండయ్యాయా ఓ సారీ

మేము వచ్చేటప్పుడు లీగల్ గా హెల్తీ గా

వచ్చామండయ్యా

 

బ్యాంకులు కొల్లగొట్టి  రాలేదండయా

అత్యున్నత పదవులు పొంది

అత్యుత్సాహంగా  రాలేదండయా

 

పొట్ట చేత పట్టుకొని

ఆశలు మూట కట్టుకొని

కన్నీళ్లు ఉగ్గపట్టుకొని

వచ్చామండయ్యా

 

అయ్యా మేము ఒకటే అడుగుతున్నాం

ప్రభుత్వాలు ఎవరి కోసం ఉన్నాయి ??

అన్నీ రూల్స్ ప్రకారం నడిస్తే  ఇబ్బందులు

ఎందుకు వస్తాయి

అప్పుడు ప్రభుత్వాలు ఎందుకు??

 

ఆడువారిని చూడాగానే  ప్రతి ఒక్కరికి 

అశ్లీలంగా మాట్లాడాలనే ఆలోచన

వస్తుందేమోనయ్యా 

కుటుంబ సమస్యల

కోసం కన్నీళ్ల తో కాలం గడుపుతామయ్యా

 

మిమ్మల్ని  కువైట్ రూల్స్

మార్చమని అడగటం లేదయ్యా

మాకు భరోసా ఇవ్వండి

మీరు ఉన్నది మాలాంటి ప్రవాసులే అయితే   

మాలాంటి భారతీయులే  అయితే   

 

అది చేస్తాము ఇది చేస్తాము అనికాదందయ్యా

మేము ఎదురు చూస్తుంది

మేమున్నామనే భరోసా ఇవ్వండయ్య  

కువైట్ లో ఉన్న ఆడవారిని గౌరవించండి

 

ఇన్నాల్లకు మాలాంటి విగత ప్రవాసులకు కోసం

ఎదో చట్టం తెస్తున్నరంట కదయ్యా

ఈ చట్టం తో మా బ్రతుకులు బాగు పడతాయని

ఎంతో ఆశగా ఎదురు చుస్తున్నమయ్య

 

ఈ చట్టం అవగాహన కోసం మీరు వస్తున్నరంట కదయ్యా

మీ ప్రయత్నం ఫలించాలని మా నిండు మనస్సులతో ఆసీర్వాదలయ్య

 

 

లక్ష్మి ఓర్సు / రేణుక లక్ష్మిదేవమ్మ / సత్యవతి సావిత్రమ్మ / చరాశే


   అయ్యా APNRT రవయ్య! కువైట్ కు పొట్ట చేత పట్టుకొని వచ్చామండయ్యా!! మేమున్నామనే భరోసా ఇవ్వండయ్య