అమ్మ హెల్పింగ్ హ్యాండ్స్ కువైట్ వారి ఆధ్వర్యం లో 25 వేల రూపాయిల నిత్యావసర వస్తువులు హైదరాబాద్ లోని అనాధ శరణాలయం లాహిరి హోమ్ లో పంపిణి...

Header Banner

అమ్మ హెల్పింగ్ హ్యాండ్స్ కువైట్ వారి ఆధ్వర్యం లో 25 వేల రూపాయిల నిత్యావసర వస్తువులు హైదరాబాద్ లోని అనాధ శరణాలయం లాహిరి హోమ్ లో పంపిణి...

  Thu Jul 13, 2017 07:00        Associations, Helping Hand, Kuwait, Telugu

హైదరాబాద్ నందు ఉప్పల్ లోని అనాధ శరణాలయం లహరి హోమ్  నిర్వాహకురాలు రాధిక గారు గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో అష్ట కష్టాలు పడి దాదాపు 40 మంది అనాధ పిల్లలను, వృద్ధులను పోషిస్తున్నారు. టౌన్ లో వున్నంత వరకూ వారికి చాలా మంది సహాయ పడేవారు కానీ ఇరుగుపొరుగు వారు ఆ వృద్ధులను చూసి ఇల్లు ఖాళీ చేయించేవారు. అలా 7, 8 ఇల్లు ఖాళీ చేయించిన తరువాత చివరకు ఊరి బయట స్మశానం దగ్గర కొంత స్థలం తీసుకొని ఆశ్రమం నిర్మించి వీరందరినీ పోషిస్తున్నారు.  దాదాపు 3 సంవత్సరాలుగా ఆశ్రమ పనులు పూర్తి కాకపోవడంతో ఇప్పుడు దాతల సహాయం కోరుచున్నారు. తను కూలి పని చేస్తూ కూడా చాలా మందిని పోషించిన ఆమెకు అమ్మ హెల్పింగ్ హ్యాండ్స్ కువైట్ తమ వంతుగా సహాయం గా 25 వేల రూపాయల విలువ చేసే  నిత్యావసర వస్తువులు అందజేశామరు.. ఈ కార్యక్రమానికి సహకరించిన కార్యవర్గ సభ్యులు అందరికి కమిటి సభ్యలు కృతజ్ఞతలు తెలియ పర్చారు.  

కువైట్ లో ఎన్నో సేవ సంఘాలు ఉన్నాయి వారందరూ కుడా తమ వంతు సహాయం చెయ్యాలని కువైట్ ఎన్నారై ద్వారా ఆశిస్తున్నాను.అంటూ అమ్మ హెల్పింగ్ హ్యాండ్స్ కువైట్ ప్రెసిడెంట్ శ్రీ ప్రభాకర్ యాదవ్ విజ్ఞప్తి చేసారు.   అమ్మ హెల్పింగ్ హ్యాండ్స్ కువైట్ వారి ఆధ్వర్యం లో 25 వేల రూపాయిల నిత్యావసర వస్తువులు హైదరాబాద్ లోని అనాధ శరణాలయం లాహిరి హోమ్ లో పంపిణి